ఢిల్లీతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తడంతో ఆల్‌టైం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ పరిసరాలు నీట మునిగాయి. సీఎం కేజ్రీవాల్ ఆఫీసు కూడా జలమయం అయ్యింది. ఇక వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నీట మునిగింది. దీంతో ఆ ప్లాంట్‌ను మూసివేశారు. రెండు రోజుల పాటు ఢిల్లీకి తాగు నీటి సరఫరా నిలిచిపోనుంది.
Tag: