స్కిల్ డెవలప్మెంట్ స్కాం(SKILL DEVELOPMENT SCAM) కేసులో చంద్రబాబు(CHANDRABABU)కు ఏసీబీ కోర్టు(ACB COURT) 14P రోజుల రిమాండ్(14 DAYS REMAND) విధించింది.
vijay sai reddy
-
-
తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రతకు మారుపేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా లిక్కర్ కేసులో అరెస్టయి, అప్రూవర్‌గా మారిన పెనక శరత్ చంద్రారెడ్డికి వైసీపీ ప్రభుత్వం చోటు కల్పించింది. వైసీపీలో దాదాపు నంబర్ 2గా, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి అల్లుడి అన్న కావడమే ఇందుకు ప్రధాన కారణం. బెంగళూరులో సీఎం జగన్ ఇల్లున్న యలహంక ప్రాంత ఎమ్మెల్యే ఎస్‌ఆర్ విశ్వనాథ్‌రెడ్డిని సభ్యుడిగా మరోమారు కొనసాగించింది.వైసీపీ అధికారంలోకి రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా శరత్‌చంద్రారెడ్డి చేతుల్లోకి వచ్చిందంటే అది విజయసాయి రెడ్డి ప్రభావమే. శరత్ చంద్రారెడ్డి వ్యాపార సంస్థ అయిన అరబిందోకు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు సైతం దక్కాయి. తితిదే ఛైర్మన్, ఈవో సహా తిరుమల తిరుపతిల్లోని కీలక పదవులను ఒక ప్రధాన సామాజికవర్గానికి ప్రభుత్వం కట్టబెట్టింది. తాజాగా తితిదే పాలకమండలిలోని 24 మంది సభ్యులలో అయిదుగురు ఆ సామాజికవర్గానికి చెందిన వారే.