త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. సాగర్ జిల్లాలో ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్ స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు.
temple
-
-
గత నెల 18న అధిక శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకు నిజ శ్రావణ మాసం ఉంటుంది. నిజ శ్రావణ మాసంలో ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకు శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.
-
భక్తి
MYSTERIOUS TEMPLE IN HAMPI: ఎన్నో వింతలు విశేషాలకు నెలవు హంపీ విరూపాక్ష ఆలయం
by స్వేచ్ఛby స్వేచ్ఛరాజ్యాలు రాళ్ళలో కరిగిపోవచ్చు.. రాజులు మట్టిలో కలిసిపోవచ్చు. అంగరంగ వైభవంగా అలరారిన అలనాటి కళా వైభవాన్ని నేటికీ సజీవంగా కళ్ల ముందుంచేవి మాత్రం అపూరప చారిత్రక కట్టడాలే. అందులో ఆధ్యాత్నిక సౌరభాలను వెదజల్లుతూ.. అద్భుత కళా సంపదను నింపుకున్న దేవాలయాల్లో ఎన్నో అంతుపట్టని రహస్యాలు. శాస్త్ర, సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా ఆ రహస్యాల ఛేదన కొనసాగుతూనే ఉంది కానీ, ఒక కొలిక్కిరావడం లేదు. వాటిలో ఒక్కటి విజయనగర సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన హంపి నగరంలోని విరూపాక్ష దేవాలయం. ఈ కోవెలలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చదివేయండి.
-
శక్తి స్వరూపుణి వెలసిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో నీలాచల్ పర్వతశ్రేణి మీద ఈ కామాఖ్యా దేవి క్షేత్రం విరాజిలుతోంది. ఎలాంటి విగ్రహారాధనా జరగని కామాఖ్యా అమ్మవారి ఆలయ విశేషాలు..
-
సుమారు 500ఏళ్ల పైగా చెక్కు చెదరని వర్ణ చిత్రాలూ, భారీ నంది విగ్రహం, ఏడు పడగల నీడన శివుడు, వేలాడే ఆకాశ స్థంభం.. ఇలాంటివెన్నో ఆకర్షణలు ఈ ఆలయం సొంతం. అబ్బురపరిచే శిల్ప సంపదకే కాదు, ఔరా అనిపించే చిత్రకళా నైపుణ్యానికీ నిలయం ఈ లేపాక్షి ఆలయం. ఎంతో చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయ విశేషాలు మీకోసం.
-
పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దేశానికి దక్షిణ భాగంలో వున్న మహాక్షేత్రం రామేశ్వరం. సనాతన హిందూ మతానికి సంబంధించిన చార్ ధామ్‌లలో ఒకటైన రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. లయకారకుడైన శివుడు రామనాథస్వామిగా భక్తులను ఆశీర్వదిస్తుంటారు. తమిళనాడుకు ప్రధాన భూభాగమైన మండపానికి సమీపంలోని రామేశ్వరం ద్వీపంలో వున్న ఈ క్షేత్రం విశేషాలు..