భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు ఫోన్ కాల్ చేసారు. అయితే భారత్‌లో జరుగనున్న జీ20 సమ్మిట్‌కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు.
prime minister
-
-
చంద్రయాన్-3 విజయం ఊపు ఇంకా తగ్గలేదు. ఏదో చోట ఆ బజ్ కనిపిస్తోనే ఉంది. ఇంతటి గొప్ప విజయం సాధించిన టైంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ఉన్నారు.
-
చంద్రయాన్ -3 విజయం అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలను కలిసేందుకు ప్రధాని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిజీ షెడ్యూల్ ఉండటం వలన శుక్రవారం సాధ్యపడలేదు.
-
తయారీలోనే ప్రత్యేకత మూటగట్టుకున్న తెలంగాణ కూజా (సురాయి).. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు కానుకగా దక్కింది. ఆయన భార్య షెపో మొత్సొపెకు నాగాలాండ్ శాలువా బహుమతిగా అందింది.
-
అంతర్జాతీయం
Prime Minister: భారత్ ప్రధానిని అత్యున్నత పురస్కారంతో గౌరవించిన గ్రీస్..
by స్వేచ్ఛby స్వేచ్ఛగ్రీస్లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోడీకి గ్రీస్‌లోని ఏథెన్స్లో శుక్రవారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు’ లభించింది
-
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనున్న “బ్రిక్స్” కూటమి 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు.
-
పేరు మార్పులపై దృష్టి పెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇపుడు రాజధాని న్యూఢిల్లీలో తీన్‌మూర్తి భవన్లో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును మార్చారు. ఇకపై ఈ మ్యూజియం ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సోసైటీ(పీఎంఎంఎల్) పేరుతో కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం సోమవారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పేరు మార్పుపై ప్రతిపక్ష కాంగ్రెస్.. అధికార బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నెహ్రూ పేరుని చరిత్ర పుటల్లోంచి తొలగించడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడగా, ప్రధానమంత్రులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చామని బీజేపీ ఎదురుదాడికి దిగింది. అంతర్జాతీయంగా ఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడే వివాదం రేగింది. ‘‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇక నుంచి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీగా మారింది. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వైవిధ్యాన్ని చాటి చెప్పడానికే ఈ పేరు మార్పు జరిగింది. ఈ నెల 14 నుంచి ఉత్వర్వులు అమల్లోకి వచ్చాయని పీఎంఎంల్ వైస్ చైర్మన్ సూర్యప్రకాశ్ వెల్లడించారు. తీన్‌మూర్తి భవనంలో 16 ఏళ్లపాటు నెహ్రూ అధికారిక నివాసంగా ఉంది. ఆ తరువాత 1966, ఏప్రిల్1న అందులో నెహ్రూ మ్యూజియంను ఏర్పాటు చేశారు.
-
ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం బిందేశ్వర్ పాఠక్(80) తుదిశ్వాస విడిచారు.
-
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
-
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టింది. బలమైన బీజేపీ ప్రభుత్వం ముందు ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.