గత నెల నుంచి దాయాది దేశం పాకిస్తాన్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా 50మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. జూన్ 25న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్తాన్ అంతటా వివిధ వర్షాలకు సంబంధించిన సంఘటనలలో యాభై మరణాలు నమోదయ్యాయి. ఈ కాలంలో 87 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.
Tag: