ఢిల్లీతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తడంతో ఆల్‌టైం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ పరిసరాలు నీట మునిగాయి. సీఎం కేజ్రీవాల్ ఆఫీసు కూడా జలమయం అయ్యింది. ఇక వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నీట మునిగింది. దీంతో ఆ ప్లాంట్‌ను మూసివేశారు. రెండు రోజుల పాటు ఢిల్లీకి తాగు నీటి సరఫరా నిలిచిపోనుంది.
Tag:
heavy floods
-
-
దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 80 మంది ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే మరణించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు