డిసెంబర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల నాయకత్వంలో బీజేపీ అధిష్ఠానం పలు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్‌లను బీజేపీ అధిష్ఠానం నియమించింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించారు.