పశ్చిమ బెంగాల్‌లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో 11 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారితో పాటు సామాన్యులు ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడినవారిలో పోలీసులూ ఉన్నారు.
Tag: