ఆర్టికల్ 370(ARTICLE 370) రద్దుకు సంబంధించి విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు(SUPREME COURT) తీర్పును రిజర్వ్ చేసింది. జమ్మూకశ్మీర్(JAMMU & KASHMIR)కు ప్రత్యేక హోదా కల్పించిన భారత(INDIA) రాజ్యాంగం(CONSTITUTION)లోని ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపైనా విచారణను సుప్రీంకోర్టు ముగించింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్(D.Y CHANDRACHUD) నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 16 రోజుల పాటు రోజూ విచారణ జరిపింది. ఈ సందర్భంగా అన్నివైపుల నుంచి సుదీర్ఘంగా వాదనలు స్వీకరించిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్లు, ప్రతివాదులకు చివరి అవకాశాన్ని కూడా ఇచ్చింది. వారి తరఫు న్యాయవాదులు ఎవరైనా ఇంకా రాతపూర్వక వాదనలు ఇవ్వాలనుకుంటే వచ్చే 3 రోజుల పాటు వాటిని కోర్టుకు అందించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఆ వాదనలు 2 పేజీలకు మించి ఉండకూదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5 వ తేదీన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఈ రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఈ పిటిషన్లను అన్నింటినీ కలిపి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి విచారణ జరిపారు. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్(JUSTICE SANJAY KISHAN KOUL), జస్టిస్ సంజీవ్ ఖన్నా(JUSTICE SANJEEV KHANNA), జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్(JUSTICE SURYAKANTH) ఉన్నారు.
ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా మొదట అనుకూల, ప్రతికూల పార్టీల నుంచి దస్త్రాలు, రాత పూర్వక వివరణలను ఈ ఏడాది జులై(JULY) 27 వ తేదీ వరకు స్వీకరించింది. ఆ తర్వాత ఆగస్టు 2 (AUGUST 2)వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించింది. సోమ(MONDAY), శుక్రవారా(FRIDAY)లు మినహా మిగతా రోజుల్లో పిటిషన్లపై రోజు వారీ విచారణను కొనసాగించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
ఈ పిటిషన్లపై కేంద్రం తన వాదనలు వినిపిస్తూ.. జమ్ము కశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని స్పష్టం చేసింది. ఆ రాష్ట్రానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రూపొందిస్తున్నామని తెలిపారు. అయితే దానికి కొంత సమయం పడుతుందని కోర్టుకు(COURT) కేంద్ర ప్రభుత్వం విన్నవించింది. అయితే జమ్ము కశ్మీర్‌లో ఏ క్షణమైనా ఎన్నికలు(ELECTIONS) నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా కేంద్రం తరఫున లాయర్లు వెల్లడించారు. అయితే లడఖ్(LADAKH)కు సంబంధించి.. మరికొంత కాలం కేంద్ర పాలిత ప్రాంతం హోదా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.