Monday, December 23, 2024
Home జాతీయం Supreme Court Cases Data is in online: ఆన్​లైన్​లో సుప్రీంకోర్టు కేసుల డేటా..

Supreme Court Cases Data is in online: ఆన్​లైన్​లో సుప్రీంకోర్టు కేసుల డేటా..

by స్వేచ్ఛ
0 comment 61 views
SUPREME COURT CASES IS IN ONLINE

సుప్రీంకోర్టు(SUPREME COURT)లో పెండింగ్ కేసులు(PENDING CASES), పరిష్కారమైన కేసుల వివరాలు(CASES DATA) ఇకపై ఆన్​లైన్​(ONLINE)లో అందుబాటులో ఉండనున్నాయి. నేషనల్ జ్యుడిషియల్(NATIONAL JUDICIAL) డేటా(DATA) గ్రిడ్ పోర్టల్(ఎన్​జేడీజీ)​కు సుప్రీంకోర్టును త్వరలో అనుసంధానిస్తామని సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్(DY CHANDRACHUD) ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని సీజేఐ(CJI) అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇప్పటివరకు కింది స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు డేటాను(HIGH COURT DATA) పొందుపరిచే ఎన్​జేడీజీ పోర్టల్​లో త్వరలో సుప్రీంకోర్టుల కేసుల వివరాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

‘ఇది చరిత్రాత్మకమైన రోజు. సుప్రీంకోర్టులో పెండింగ్, పరిష్కారమైన కేసుల వివరాలు త్వరలో ఎన్​జేడీజీ పోర్టల్​లో చూసుకోవచ్చు. సంవత్సరాలవారీగా పెండింగ్​లో ఉన్న కేసుల గురించి తెలుసుకోవచ్చు. ఎన్​జేడీజీలో సుప్రీంకోర్టు డేటాను అప్​లోడ్ చేయడం వల్ల న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్న దిగువస్థాయి కోర్టుల నుంచి హైకోర్టుల స్థాయి వరకు డేటా ఎన్​జేడీజీలో అందుబాటులో ఉంటుంది. ఇందులో పెండింగ్, పరిష్కారమైన కేసుల వివరాలు ఉంటాయి. రెండు రోజుల క్రితం (సెప్టెంబరు 12) భారత శిక్షాస్మృతిలోని రాజద్రోహం నిబంధనకు చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. విస్త్రృత ధర్మాసనానికి బదిలీ చేసే నిర్ణయాన్ని వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.

సంబంధిత పత్రాలను సీజేఐ ఎదుట ఉంచాలని.. తద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి చర్యలు తీసుకుంటారని రిజిస్ట్రీని ఆదేశించింది.IPC, CRPC, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అందుకు సంబంధించిన బిల్లులు ప్రస్తుతం పార్లమెంటు స్థాయీసంఘం పరిశీలనలో ఉన్నట్లు గుర్తు చేసింది. అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ.. రాజద్రోహానికి సంబంధించిన 124A నిబంధన అమల్లో ఉన్నంత కాలం.. ఆ సెక్షన్‌ కింద విచారణ కొనసాగే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కోణంలో నిబంధనపై మదింపు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News