వెండితెర మీద వివిధ రకాలైన పాత్రలతో, అభినయంతో లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్, నిజ జీవితాల్లో మాత్రం ఒక సాదా సీదా సామాన్య వ్యక్తిలా ప్రవర్తిస్తారు. అందుకే అతన్ని అందరూ తలైవా అని పిలుస్తూ వుంటారు. అతని పేరు లేదా అతన్ని వెండి తెర మీద చూసినప్పుడు అతని అభిమానులు ఈలల తోనూ, చప్పట్ల తోనూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. రజినీకాంత్ కి ఒక్క తమిళ నాడులోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా, భాషతో సంబంధం లేకుండా వేల లోనూ, లక్షల్లోనూ అభిమానులు వున్నారు.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తాను ప్రజల్లో ఒకడిని అని మరోసారి నిరూపించాడు. దానికి కారణం.. నేడు ఉదయం 11:30 గంటలకు దక్షిణ బెంగళూరులోని జయనగర్ ప్రాంతం లోని బీఎంటీసీ డిపోను రజనీకాంత్ ఆకస్మికంగా సందర్శించారు.. జయనగర్ డిపోకు వెళ్లి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సిబ్బందికి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్‌లను అనుకోకుండా కలిసి రజినీకాంత్ వారినిఆశ్చర్యపరిచారు. బెంగళూరులోని బిఎమ్‌టిసి అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సూపర్‌స్టార్ బస్ డిపోను సందర్శించారు. అక్కడ ఉన్న మెకానిక్‌లు, ఇతర కార్మికులు కూడా ఆయనతో సెల్ఫీలను తీసుకున్నారు. రజనీకాంత్ బీఎంటీసీ సిబ్బందితో సుమారు 15 నిమిషాల పాటు సంభాషించడం జరిగింది.. రజనీకాంత్ మొదట నటుడు కాకముందు బీఎంటీసీలో కండక్టర్‌గా పని చేసాడు. బస్‌లో ఎంతో స్టైల్‌గా టికెట్స్ ఇస్తున్న రజనీనీ చూసి దర్శకుడు బాల చందర్ ఆశ్చర్యపోయి ఆయనను సినిమాలలోకి పరిచయం చేసారు. రజనీకాంత్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. దీనితో నేడు రజనీకాంత్ బీఎంటీసీ సిబ్బందినీ కలవడంతో అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు.