మనిషి బుద్ది వక్రీకరించడంతో అధికారంలో ఉన్నామని తెలిసి కూడా లైంగిక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజలకు రక్షణ ఇచ్చే పోలీసులే దారుణాలకు తెరలేపుతున్నారు. తమకు ఉన్నది అత్యుత్తమ పదవి అని కూడా మరచిపోయి దాష్టికాలకు పాల్పడుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఛాన్స్ దొరికితే అప్పుడు అలా వినియోగించుకుంటున్నారు. తమ ఆసరాకోరి వస్తే.. కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఏదో ఒక ఈవెంట్ పేరు చెప్పి.. యువతులపై లైంగిక చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ఏపీలో వెలుగుచూసింది.
బర్త్ డే వేడుకలకు పిలిచి, మత్తుమందు ఇచ్చి ఎస్సై తనపై అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. పుట్టినరోజు వేడుకలకు ఇంటికి పిలిపించి ఎస్సై తనపై దారుణానికి పాల్పడ్డారని యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్‌బాబు పేర్కొన్నారు. గతంలో అద్దంకి ఎస్సైగా పనిచేసిన సమందర్‌వలీ… తనను పుట్టినరోజు వేడుకల పేరుతో ఇంటికి పిలిపించారని, తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. మత్తుమందు ఇచ్చి అశ్లీల చిత్రాలు తీశాడని, పెళ్లి చేసుకోమని అడిగితే చంపుతానని బెదిరించినట్లు అద్దంకి పట్టణానికి చెందిన యువతి ఆరోపిస్తోంది. సీఐ ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.