Monday, December 23, 2024
Home ఆంధ్రప్రదేశ్ CM Jagan Good News to Students: ఏపీ విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పును సీఎం జగన్ శ్రీకారం

CM Jagan Good News to Students: ఏపీ విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పును సీఎం జగన్ శ్రీకారం

by Mahadev
0 comment 52 views
CM Jagan Good News to Students

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం (Jagan Government) విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. ప్రభుత్వ బడి పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అందుబాటులోకి ఐబీ (ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్) సిలబస్‌ రానుంది. ఈ మేరకు సచివాలయం(Secretariat)లోని తన కార్యాలయంలో ఐబీ సంస్థతో ఎంవోయూ (MOU) జరిగిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.

‘‘విద్యలో నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యం. మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకోసమే మీ సహకారాన్ని కోరుతున్నాం. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్‌ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నది మా ఉద్దేశం. ఐబీ(International Baccalaureate) సిలబస్‌ అనేది సవాల్‌తో కూడుకున్నది. అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం అనేది ఇంకా పెద్ద సవాల్‌. కానీ సంకల్పం ఉంటే సాధ్యంకానిది లేదు. పాఠశాల విద్యను బలోపేతంచేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటాయి. ఏపీలో పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం. స్కూళ్లను బాగుచేయడం దగ్గరనుంచి డిజిటలైజేషన్‌ వరకూ అనేక చర్యలు తీసుకున్నాం.

బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ తీసుకు వచ్చాం. పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. టోఫెల్‌ పరీక్ష(TOEFL exam)ల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిరోజూ ఒక పీరియడ్‌ టోఫెల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం. అన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఐబీని తీసుకు వచ్చాం. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదు. ఒకటో క్లాసుతో మొదలు పెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయి.ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుంది. దిగువస్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మా ఉద్దేశం. దేవుడి దయ వల్ల ఈ లక్ష్యం సిద్ధిస్తుంది. ఐబీ భాగస్వామ్యానికి కృతజ్ఞతలు” అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఐబీ అంటే ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ అని అర్థం. ఈ విద్యా విధానంలో చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెర్నింగ్ లాంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్-మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నతా విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News