ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గరుడ వాహన సేవ (Garuda Vahana Seva) కన్నులపండువగా సాగింది. శ్రీవిల్లీ పుత్తూరు నుంచి తెచ్చిన గోదాదేవి తులసీ మాలలు, పరిమళ భరిత పూమాలలు, నిత్యం మూలవిరాట్టుకు అలంకరించే మకరకంఠి, లక్ష్మీకాసులహారం, సహస్రనామమాల, విశేష తిరువాభరణాలతో మలయప్పస్వామిని వాహన మండపంలో సుందరంగా అలంకరించి.. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు గరుడవాహన సేవను ప్రారంభించారు. తిరువీధుల్లో విహరిస్తున్న శ్రీనివాసుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు.. గోవింద నామస్మరణలు చేస్తూ.. స్వామికి కర్పూర హారతులు సమర్పించారు.
గరుత్మంతుడు (Garuda)శ్రీ మహావిష్ణువు నిత్య వాహనం కావడంతో.. ఈ సేవను తిలకించడం ద్వారా సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సుమారు నాలుగు గంటల పాటు.. నాలుగు మాడవీధుల్లో వాహన ఊరేగింపు సాగింది. పన్నెండు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వాహన సేవ ముందు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో(Salakatla Brahmotsavam) ప్రధానఘట్టమైన గరుడసేవ.. ఆద్యంతం నేత్ర పర్వంగా సాగింది. అత్యంత ప్రీతి పాత్రమైన గరుత్మంతునిపై స్వామి వారు తిరువీధుల్లో విహరిస్తూ.. భక్తజనాన్ని కటాక్షించారు. సుమారు నాలుగు గంటలపాటు గరుడ సేవ సాగగా… టీటీడీ ప్రయోగాత్మకంగా మాడవీధుల మూలల్లో క్యూ లైన్లు ఏర్పాటు చేసి.. భక్తులకు దర్శనం కల్పించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గరుడ వాహన సేవ కన్నులపండువగా సాగింది. శ్రీవిల్లీ పుత్తూరు నుంచి తెచ్చిన గోదాదేవి తులసీ మాలలు.. పరిమళ భరిత పూమాలలు, నిత్యం మూలవిరాట్టుకు అలంకరించే.. మకరకంఠి, లక్ష్మీకాసులహారం, సహస్రనామమాల, విశేష తిరువాభరణాలతో మలయప్పస్వామిని వాహన మండపంలో సుందరంగా అలంకరించి.. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు గరుడవాహన సేవను ప్రారంభించారు.
తిరువీధుల్లో విహరిస్తున్న శ్రీనివాసుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు.. గోవింద నామస్మరణలు చేస్తూ.. స్వామికి కర్పూర హారతులు సమర్పించారు. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు నిత్వాహనం కావడంతో.. ఈ సేవను తిలకించడం ద్వారా సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సుమారు నాలుగు గంటల పాటు.. నాలుగు మాడవీధుల్లో వాహన ఊరేగింపు సాగింది. పన్నెండు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వాహన సేవ ముందు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
కల్పవృక్షంపై భక్తులకు దర్శమిస్తున్న మలయప్ప స్వామిశుక్రవారం ఉదయం మోహిని అవతారంలో మాడవీధుల్లో విహరించిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు అలాగే.. మాడ వీధుల్లో కూర్చుండిపోయారు. మరో వైపు గరుడవాహన సేవ వీక్షించడానికి వస్తున్న భక్తులు తిరువీధుల్లోకి చేరుకున్నారు. దీంతో మాడవీధులు కిక్కిరిసిపోయాయి.స్వామి వాహన సేవలో ప్రయోగాత్మకంగా హారతులను నిలిపివేసి ఆ సమయంలో సుమారు 30 వేల మంది భక్తులకు తి.తి.దే దర్శనభాగ్యం కల్పించింది.
వాయువ్య, ఈశాన్య మూలల్లో సుమారు గంటన్నర పాటు వాహనాన్ని నిలిపి ఆయా ప్రాంతాల్లో శ్రీవారి వాహనసేవ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను మాడవీధుల్లోకి అనుమతించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానంతో వాహనానికి సమీపంలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, తిరుపతి జిల్లా పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.