భారత్‌ను వణికించేందుకు మరో వైరస్ సిద్ధమైంది. కేరళలో మరోసారి ఈ వైరస్(Nipah Virus) కలకలం సృష్టిస్తోంది. కోజీకోడ్‌లో ఇప్పటికే ఇద్దరు ఈ మహమ్మారి సోకి మరణించగా.. మంగళవారం రోజున మరో ఇద్దరికి నిఫా వైరస్ నిర్ధరణ కావడం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోజీకోడ్ పొరుగు జిల్లాలైన కన్నూర్, వయనాడ్, మలప్పురం జిల్లాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. కోజీకోడ్ మెడికల్ కాలేజీ(Kozhikode Medical College)లో 75 ఐసోలేషన్ గదులను సిద్ధం చేసినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో నిఫా వైరస్‌లో కనిపించే వేరియంట్.. బంగ్లాదేశ్ వేరియంట్ అని వెల్లడించారు.
కోజీకోడ్ జిల్లాలో ఏడు గ్రామపంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు వీణా జార్జ్ చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 16 కమిటీలను ఏర్పాటు చేశామని.. ఈ నిఫా వైరస్ వేరియంట్ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందని తెలిపారు. దీని మరణాల రేటు తక్కువగా ఉందని.. ఈ వేరియంట్ వ్యాప్తి కూడా తక్కువగానే ఉందని వెల్లడించారు. కంటైన్మెంట్ జోన్లను గుర్తించడం, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ గదుల ఏర్పాట్లు వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) బృందాలు కేరళకు చేరుకుంటామని అన్నారు. కేరళలో నిఫా వైరస్‌లో కనిపించే వేరియంట్.. బంగ్లాదేశ్ వేరియంట్ అని వీణా జార్జ్ పేర్కొన్నారు.’కేరళలో కనిపించే నిఫా వైరస్ జాతి బంగ్లాదేశ్ వేరియంట్. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. మరణాల రేటు తక్కువగా ఉంది. ఈ వేరియంట్ వ్యాప్తి కూడా తక్కువగానే ఉంది. కంటైన్మెంట్ జోన్లను గుర్తించడం, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ గదుల ఏర్పాట్లు వంటి చర్యలు తీసుకుంటున్నాం.’ అని వీణా జార్జ్ తెలిపారు.