ఇండియా(INDIA) పేరును భారత్(BHARATH) గా కేంద్ర మారుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనకు బలం చేకూరుస్తూ జీ20(G20) సమావేశానికి హాజరయ్యే దేశాధినేతలను విందుకు ఆహ్వానించే నోట్ లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా ప్రచురించడం, ఆ తరువాత ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ను కూడా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’గా మార్చడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ప్రతిపక్షాలున్నీ కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేయడంతోనే కేంద్రంలోని బీజేపీ ఇండియా పేరుకు బదులుగా భారత్ గా మారుస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇండియా పేరు మార్పుపై ఇప్పుడు ఓ కొత్త విషయం సోషల్ మీడియా(SOCIAL MEDIA)లో తెగ వైరల్ అవుతోంది. సౌత్ ఆసియా ఇండెక్స్(SOUTH ASIA INDEX) ఎక్స్ (TWITTER)లో షేర్ చేసిన పోస్టులో ‘ పాకిస్తాన్(PAKISTAN) ఇండియా పేరును క్లెయిమ్(CLAIM) చేయవచ్చు, ఒక వేళ యూఎన్ స్థాయిలో ఇండియా పేరును అధికారికంగా గుర్తిస్తే పాకిస్తాన్ దానిపై దావా వేయవచ్చు. పాకిస్తాన్ లోని జాతీయవాదులు చాలా కాలంగా ఇండియా అనే పేరుపై హక్కులు ఉన్నాయని వాదిస్తున్నారు. ఇది పాకిస్తాన్ సింధు ప్రాంతాన్ని సూచిస్తుంది.’’ అని పేర్కొంది.
అయితే దేశం పేరు మార్పుపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. రాజ్యాంగం(CONSTITUTION)లోని ఆర్టికల్1(ARTICLE 1)లో దేశం పేరును ఇండియా, భారత్ గా సూచిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ట్వీట్ పై పలువురు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని ఓ జోక్ గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. పాకిస్తాన్ ‘ఇండియా’ పేరును క్లెయిమ్ చేస్తే, ఆఫ్ఘనిస్తాన్(AFGHANISTAN) పాకిస్తాన్ పేరును, రష్యా(RUSSIA) ఆఫ్ఘనిస్తాన్ పేరును క్లెయిమ్ చేయవచ్చని, పాకిస్తాన్ పూర్తిగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే చైన్ రియాక్షన్ ని ప్రారంభించకూడదంటూ ఓ నెటిజన్ సెటైర్లు వేశారు. పేరు మారినా పాకిస్తాన్ అదృష్టం మారదని మరొకరు వ్యాఖ్యానించారు. మరొకరు పాకిస్తానీలు పాకిస్తాన్ పేరును ఇండియాగానా..? హిందూస్థాన్ గా, ఇండస్తాన్ గా ఏ విధంగా మార్చాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
పాశ్యాత్య దేశాలు సింధు నదిని ఇండస్ గా పిలుస్తాయి. ఈ నది పేరుపై ఇండియా అనే పేరు వచ్చింది. భారత్ అనే పేరు భరతుడనే రాజు పాలించిన కారణంగా వచ్చింది. ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన నాగరికత సింధూ లోయ నాగరికత కూడా సింధు నది పరివాహక ప్రాంతంలో ఉద్భవించింది. ప్రస్తుతం సింధు నదిలో మేజర్ భాగం పాకిస్తాన్ లోనే ప్రవహిస్తోంది.