Monday, December 23, 2024
Home జాతీయం Sonia Gandhi Letter To Prime Minister: ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ..

Sonia Gandhi Letter To Prime Minister: ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ..

by స్వేచ్ఛ
0 comment 57 views
SONIA GANDHI SENTS A LETTER TO MODI

అజెండా ఏంటో చెప్పకుండా పార్లమెంటు(PARLIAMENT) ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం(CENTRAL GOVERNMENT) సిద్ధమవడంపై కాంగ్రెస్(CONGRESS) అగ్రనేత సోనియా గాంధీ(SONIA GANDHI) అభ్యంతరం తెలిపారు. ఇక జమిలి ఎన్నికలు, ఇండియా పేరు భారత్ గా మార్పు, మహిళా రిజర్వేషన్ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాని(PRIME MINISTER)కి లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. ఇదే విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విపక్షాలతో చర్చించకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా పార్లమెంటును సమావేశపరచడం గతంలో ఎన్నడూ జరగలేదని విమర్శించారు. నిర్మాణాత్మక సహకార స్ఫూర్తితో.. విపక్షాలు లేవనెత్తే అంశాల్నీ ఈ సమావేశాల్లో చర్చిస్తారని ఆశిస్తున్నట్లు ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు సోనియా. లేఖలో ప్రధానంగా 9 అంశాలను ప్రస్తావించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. అయితే సమావేశాల ఎజెండా మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

లేఖలోని 9 అంశాలు:

1) నిత్యావసరాల ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎంఎస్ఎంఈ సమస్యలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాలి.
2) రైతులు(FARMERS), రైతు సమస్యలు(FARMER ISSUES), మద్దతు ధర, ఇతర రైతు డిమాండ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
3) అదానీ(ADANI) వ్యవహారంపై జేపీసీ కోసం డిమాండ్..
4) మణిపూర్(MANIPUR) ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. రాష్ట్రంలో ప్రభుత్వం విఫలం అవ్వడం
5) హర్యానా(HARYANA)లో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడం.
6) చైనా(CHINA) భారత(INDIA) భూభాగన్ని ఆక్రమించడం. లడఖ్(LADAKH), అరుణాచల్ ప్రదేశ్(ARUNACHAL PRADESH) సరిహద్దుల్లో మన సార్వభౌమధికారానికి సవాళ్లు.
7) కుల గణనపై చర్యలు తీసుకోవడం.
8) కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతినడం
9) కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు

ఇతర రాజకీయ పార్టీలతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా సమావేశాలు ఏర్పాటు చేశారని సోనియా గాంధీ ఆరోపించారు. నిర్మాణాత్మక సహకార స్పూర్తితో సమస్యలపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. రాబోయే సమావేశంలో అదానీ అంశాన్ని లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. ఇండియా కూటమి మొదటి బహిరంగ ర్యాలీని మధ్యప్రదేశ్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తన నివాసంలో ఇండియా కూటమిలోని పార్టీలను నేతలతో సమావేశమయ్యారు. అజెండా లేకుండా మోడీ సర్కార్ పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు.

అయితే.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్ని బహిష్కరించే ఆలోచన కాంగ్రెస్​కు లేదని ఆ పార్టీ ఎంపీ జైరాం రమేశ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు దీనిని ఒక అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రతి పార్టీ తన వంతు కృషి చేస్తుందని అన్నారు జైరాం రమేశ్. ఏఐసీసీ కార్యాలయంలో మాట్లాడిన రమేశ్​.. అజెండా లేకుండా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని విమర్శించారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News