హైదరాబాద్(HYDERABAD)లోని నార్సింగి(NARSINGHI) దగ్గర 23 కిలోమీటర్ల మేర నిర్మించిన సోలార్ సైకిల్ ట్రాక్(SOLAR CYCLE TRACK)ని మంత్రి కేటీఆర్(MINISTER KTR) ప్రారంభించారు. హెచ్ఎండీఏ(HMDA) నిర్మిచిన ఈ సోలార్ సైకిల్ ట్రాక్ దేశంలోనే మొదటిది. 90 కోట్ల(90 CRORES) రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ట్రాక్ సైక్లిస్ట్‌ల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. నానక్ రామ్ గూడ(NANAKRAMGUDA) నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ(TELANGANA POLICE ACADEMY) వరకు 9 కిలోమీటర్లు, నార్సింగ్ నుంచి కొల్లూరు(NARSINGHI TO KOLLUR) వరకు 14 కిలోమీటర్ల మేర మూడు లేన్(THREE LANES)లతో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. 4.5 మీటర్స్ వెడల్పుతో ట్రాక్ ఉంటుంది. ఇరువైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్(GREEN SPACE) ఏర్పాటుచేశారు. భద్రత కోసం ట్రాక్ చుట్టూ సీసీ కెమెరాలు(CC CAMERAS) కూడా ఏర్పాటు చేశారు. ట్రాక్ పక్కన సువాసనలను వెదజల్లే పూల మొక్కలను పెట్టారు.
సైక్లిస్ట్‌ల కోసం పార్కింగ్(PARKING), టాయిలెట్స్(TIOLETS) సదుపాయాలు కూడా కల్పించారు. ఈ ట్రాక్‌లో సోలార్ రూఫ్‌తో(SOLAR ROOF) పాటు.. లైట్లు కూడా ఉంటాయి. ఈ సోలార్ రూఫ్ వల్ల 16 మెగావాట్ల(16 MEGAWATTS) విద్యుత్(ELECTRICITY) ఉత్పత్తి చేస్తుంది. అందులో సైకిల్ ట్రాక్ కోసం 1 మెగావాట్ ఉపయోగిస్తారు. మిగిలిన విద్యుత్‌ను అవుటర్ రింగ్ రోడ్డు(OUTER RING ROAD) చుట్టూ ఉన్న లైట్ల కోసం వినియోగిస్తారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. ఐటీ కారిడార్(IT CORRIDOR)లో సైక్లిస్టులకు ఎంతో ఉపయోగపడుతుందని అభికారులు భావిస్తున్నారు. సౌత్ కొరియా(SOUTH KOREA)లో ఇలాంటి ట్రాక్ ఉన్న విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో అక్కడ పరిశీలిన జరిపేందుకు దక్షిణ కొరియాకి ఒక టీమ్‌ను పంపారు కేటీఆర్. నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం.. ఈ ట్రాక్ నిర్మాణానికి పూనుకున్నారు. ప్రపంచంలో ఇది రెండవది కాగా.. ఇండియాలో మొట్టమొదటిది. 2022 సెప్టెంబర్ 6న కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తాజాగా అది అందుబాటులోకి వచ్చింది.