విలక్షణ నటుడు శరత్ బాబు(Typical actor Sarath Babu).. ఈ ఏడాది కన్నుమూసిన విషయం తెల్సిందే. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఇక శరత్ బాబు సినిమాల గురించి అందరికి తెలుసు కానీ, ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎవరికి తెలియదు. నటి రమాప్రభ(Actress Ramaprabha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న శరత్ బాబు .. విబేధాల వలన కొన్నేళ్ళకే విడిపోయారు. ఇక రమాప్రభ వద్ద ఉన్న ఆస్తిని ఆయనే సొంతం చేసుకున్నాడని వార్తలు కూడా వినిపించాయి. ఇక రమాప్రభ తో విడాకుల అనంతరం శరత్ బాబు.. స్నేహ నంబియార్ అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆమెతో కూడా విబేధాలు రావడంతో విడాకులు ఇచ్చేసాడని వార్తలు వచ్చాయి. రెండో పెళ్లి, విడాకులు అనంతరం ఆయన సింగిల్ గా ఉండిపోయాడని తెలుస్తోంది. ఇక స్నేహ నంబియార్ అనగానే.. కోలీవుడ్ నటి అని చాలామంది అనుకున్నారు. నటిని శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఆ స్నేహ నంబియార్ తాను కాదని నటి చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నేహ.. శరత్ బాబు తన భర్త కాదు అని చెప్పి షాక్ ఇచ్చింది.
“నా పేరు స్నేహ.. నేను శరత్ బాబు రెండో భార్యను నేను కాదు. ఆయన రెండో భార్య స్నేహ నంబియార్ అంటే.. నా ఫోటోలను వాడుతున్నారు. ఆమెను నేను కాదు. నాకు, శరత్ బాబు కు ఎలాంటి సంబంధం లేదు. శరత్ బాబు రెండో భార్య స్నేహ నంబియార్ అని.. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారంటూ నా ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అసలైన స్నేహ నంబియార్ నేను కాదు.. ఆమె నాకన్నా పెద్దది.. నంబియార్ కూతురు.. నేను నంబియార్ కూతురు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ , అది కూడా నిజం కాదు. మాది కన్నూరు. అందులో నంబియార్ వర్గానికి చెడినవారం కావడంతో నా పేరు పక్కన నంబియార్ జతచేసుకున్నాను. అంతే తప్ప నంబియార్ కుమార్తెను కానీ, శరత్ బాబు రెండో భార్యను కానీ నేను కాదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.