ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తెలంగాణ పర్యటన(Tour of Telangana)లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. బేగంపేట విమానాశ్రయం రాకుండా శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయానికి ప్రత్యేక విమానంలో అక్టోబర్ 1వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్(Mahbubnagar)కు బయలుదేరి వెళ్లనున్నారు. అలా మధ్యాహ్నం 2:05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుని 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం పక్కనే ఉన్న బహిరంగ సభా స్థలికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమరభేరీ సభలో పాల్గొని.. ఈ సభావేదిక నుంచే ఎన్నికల శంఖారావాన్ని మోదీ పూరించనున్నారు.
ఆ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) వ్యవహార శైలిపై ధ్వజమెత్తనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4 గంటలకు సభ ముగించుకుని హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)నుంచి తిరిగి దిల్లీ పయనం కానున్నారు. అనంతరం కేంద్రహోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి జాతీయ నాయకులు తెలంగాణ పర్యటనకు రానున్నారు. బస్సు యాత్ర స్థానంలో ఇలా అసెంబ్లీ సెగ్మెంట్ల వద్ద జాతీయ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
మరోవైపు ప్రధాని సభలకు భారీ జన సమీకరణపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా బిల్లు ఆమోదం(Women’s Reservation Bill) నేపథ్యంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) స్వయంగా పరిశీలిస్తుండగా.., మహబూబ్‌నగర్‌లో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్నారు. మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాలను దిశానిర్దేశం చేస్తుంది కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన తర్వాత బీజేపీ అగ్రనేత అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర జాతీయ నాయకుల సభలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో చేపట్టాలనుకున్న బస్సు యాత్ర స్థానంలో వీటిని నిర్వహించాలని నిర్ణయించారు.