స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) రిమాండ్‌ను ఏసీబీ (ACB) కోర్టు పొడిగించింది. అక్టోబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం వెలువరించారు. రెండు రోజుల సీఐడీ (CID) కస్టడీ ముగిశాక చంద్రబాబును ఆన్ లైన్ ద్వారా జడ్జి ముందు హాజరుపర్చగా… ఈ మేరకు తీర్పునిచ్చారు.నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్టై రాజమహేంద్రవరం జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు.. ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది.
అక్టోబర్ 5 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి నిర్ణయం తీసుకున్నారు. కస్టడీలో భాగంగా రెండో రోజు సీఐడీ చంద్రబాబును విచారణ చేసింది. ఉదయం తొమ్మదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించింది. రెండు రోజుల కస్టడీ ముగియడంతో.. విచారణ అనంతరం ఆన్ లైన్ విధానంలో చంద్రబాబును ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపరిచారు.
సీఐడీ విచారణకు సంబంధించి చంద్రబాబును ఏసీబీ కోర్టు జడ్జి పలు ప్రశ్నలు అడిగారు. విచారణ జరిగిన తీరును తెలుసుకున్నారు. విచారణలో ఏమైనా ఇబ్బంది పెట్టారా, థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా అని చంద్రబాబును అడిగారు. అలాగే వైద్య పరీక్షలు చేయించారా, ఏమైనా అసౌకర్యం కలిగిందా అని ప్రశ్నించారు. విచారణలో ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ జడ్జి నిర్ణయం వెలువరించారు.