రోజు రోజుకీ దారుణాలు పెరిగిపోతున్నాయి. తమకు కావాల్సింది దక్కించుకునేందుకు ఎంతటి దుస్సాహసానికైనా దుర్మార్గులు ఒడిగడుతున్నారు. ఒకప్పుడు పెద్దవారు చేసే ఈ దురాగతాలు ఇప్పుడు క్రమేపి పిల్లల్లో కూడా ప్రవేశించింది. తమకు కావాల్సింది ఏ వస్తువైనా చేజిక్కించుకునేందుకు హత్యలు కూడా చేస్తున్నారు. తమ కంఫోర్ట్ కోసం, అయిన వాళ్లనే అతిదారుణంగా చంపుతున్నారు. టీనేజ్ వయసులోనే ప్రేమలో పడి ఇష్టమైన వాడికోసం ఎవరినైనా చంపేస్తున్నారు. అడ్డొచ్చిన ప్రతివారినీ తెగటార్చుకుంటూ వెళ్తున్నారు. ఇదే కోవలో తాజాగా తెలంగాణలో దారుణం జరిగింది.
జగిత్యాల జిల్లాలో మిస్టరీ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తమ ఇద్దరు కుమార్తెల్లో ఒకరు మరణించగా.. మరొకరు అదృశ్యమయ్యారు. కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజినీరైన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా ఆమె చెల్లెలు కనిపించకుండా పోవడంతో కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమునిదుబ్బ ప్రాంతంలో బంక శ్రీనివాస్, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు దీప్తి (24), చందన, ఒక కుమారుడు సాయి. దీప్తి హైదరాబాద్‌లో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. చందన బీటెక్ పూర్తి చేసి.. ఇంటి దగ్గరే ఉంటున్నారు. కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. హైదరాబాద్‌లో వాళ్ల బంధువుల గృహప్రవేశం ఉండడంతో శ్రీనివాస్ రెడ్డి, మాధవి అక్కడికి వెళ్లారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులిద్దరూ దీప్తి, చందనతో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం పెద్ద కుమార్తె దీప్తికి కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. చందనకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి సమాచారనిచ్చారు. వారొచ్చి చూడగా దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వెంటనే దీప్తి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు ప్రవీణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతం చుట్టుపక్కలా అంత పరిశీలించారు