సింగపూర్(Singapore) అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం(Tharman Shanmugaratnam) (66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. ఆయన విజయాన్ని ఎన్నికల కమిటీ ధ్రువీకరించింది. 2011 తర్వాత దేశంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా(China) సంతతికి చెందిన అభ్యర్థులను ఓడించి షణ్ముగరత్నం(Shanmugaratnam) భారీ మెజారిటీతో గెలిచారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో షణ్నుగరత్నానికి 70.4శాతం ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థులు ఎంగ్ కోక్‌సోంగ్, టాన్ కిన్ లియాన్‌లకు వరుసగా 15.7 శాతం, 13.88శాతం ఓట్లు వచ్చినట్టు ఎన్నికల కమిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకూబ్ పదవీకాలం సెప్టెంబరు 13న ముగియనుంది.
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ధర్మన్‌కు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ అభినందనలు తెలిపారు. సింగపూర్ ప్రజలు నిర్ణయాత్మక ఓట్ల తేడాతో ధర్మన్ షణ్ముగరత్నంను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారన్నారు. తమ దేశాధినేతగా ధర్మన్ విదేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. భారతీయ సంతతికి చెందిన మూడో వ్యక్తి సింగపూర్ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ కొత్త దేశాధ్యక్షుడిని అభినందించారు. ప్రధాని లీ సారథ్యంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నంకు అండగా నిలిచింది. గతంలో భారతీయ సంతతికి చెందిన ఎస్.రామనాథన్ (S.RAMANADHAN), దేవన్ నాయర్(DEVAN NAYAR) సింగపూర్ అధ్యక్షులుగా పనిచేశారు. వారి తరువాత మూడో వ్యక్తి షణ్ముగరత్నం.
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు శుక్రవారం ప్రకటించారు. షణ్ముగరత్నం సింగపూర్ దేశాధ్యక్షుడిగా ఎన్నికయినట్టు ఎన్నికల సింగపూర్‌కు 9వ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. థర్మన్ షణ్ముగరత్నం 2011 నుంచి 2019 దాకా సింగపూర్ ఉప ప్రధానిగా సేవలందించారు. 2019 – 2023 మధ్యకాలంలో సీనియర్ మంత్రిగా కేబినెట్‌లో విధులు నిర్వహించారు. ప్రముఖ ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా పేరున్న షణ్ముగరత్నం సింగపూర్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో 1957లో జన్మించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పట్టా పొందారు. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ(CAMBRIDGR UNIVERSITY) నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ.. హార్వర్డ్ యూనివర్సిటీ(HARDWARD UNIVERSITY) నుంచి మాస్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. విద్యార్థిదశలో క్రీడల్లో చురుగ్గా ఉండేవారు. ‘‘ఫాదర్ ఆఫ్ పాథాలజీ ఇన్ సింగపూర్’’గా పేరున్న వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ కె.షణ్ముగరత్నం కుమారుడే థర్మన్ షణ్ముగరత్నం. స్థానిక న్యాయవాది జేన్ యుమికో ఇట్టోగిని ఆయన వివాహం చేసుకున్నారు. దేశంలో 2011 తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుత అధ్యక్షుడు హలిమా యాకోబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13న ముగియనున్నది. అనంతరం షణ్ముగరత్నం బాధ్యతలు స్వీకరించనున్నారు. 6 సంవత్సరాలపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.