శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనివాస ఎంక్లేవ్ లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. శంషాబాద్ ఊట్పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన వడ్ల మంజులగా పోలీసులు తేల్చారు. ఈనెల 10వ తేదీన ఇంట్లో నుండి బయటకు వెళ్లిన మంజుల అదే రోజు రాత్రి హత్యకు గురైంది. మృతదేహం వద్ద దొరికిన బీరువా తాళం చెవి ఆధారంగా పోలీసులు మహిళను ట్రేస్ చేసారు. పదవ తేదీన ఉదయం మృతురాలు వడ్ల మంజుల ఇంటి నుంచి బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. మహిళను హత్య చేసిన అనుమానితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు విశ్వనీయ సమాచారం. మంజుల హత్య కేసులో ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ మహిళ ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతురాలి భర్త మాత్రం తమకు ఎవరితోనూ తగాదాలు లేవని ఎవరితోనూ గొడవ పెట్టుకోమని తెలిపాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తన భార్యను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? మాకు మాత్రం అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. మృతురాలి భర్త లక్ష్మయ్య గత కొన్ని సంవత్సరాలుగా బీపీ షుగర్ లతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. లక్ష్మయ్యకు ముగ్గురు కుమారులు అందులో ఇద్దరి వివాహం కాగా మరొకరికి కావాల్సి ఉందని ఆయన తెలిపాడు.
శంషాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మహిళకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. కాలనీలోని ప్రతి సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. మహిళకు, ఆమెను హత్య చేసిన దుండగులకు మధ్య ఘర్షణ జరిగిందా? లేక ఎక్కడైనా హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.