సినిమా పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. గద్దర్ మరణవార్త నుండి చాలా బాడ్ న్యూస్ లు విన్నాం. ప్రమాదాల వల్లో లేక అనారోగ్య సమస్యలతోనో లేదంటే వయసు సంబంధిత సమస్యలతోనో సెలబ్రిటీలు మరణిస్తున్నారు.నటీనటులు, నిర్మాతలు, దర్శకులు లేదంటే టెక్నికల్ టీం.. వాళ్ళు కూడా కాదు అంటే.. వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో నటి మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది.
సీనియర్ నటి సీమా డియో మరణ వార్త అందరినీ విషాదంలోకి నెట్టేసింది. ఆమె వయస్సు 81 సంవత్సరాలు అని తెలుస్తుంది.వృద్ధాప్య సమస్యల కారణంగానే ఆమె మృతి చెందినట్లు స్పష్టమవుతుంది. ఈమె దర్శకుడు అభినయ్ డియో తల్లి. బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఈరోజు ఉదయం 8.30-9.00 గంటల టైం లో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అల్జీమర్ అనే వ్యాధి కారణంగా ఈమె చాలా రోజుల నుండి బాధపడుతుందట.
దాని ప్రభావం వల్ల ఈమె అన్నీ మర్చిపోతూ ఉంటుందని, 3 ఏళ్లుగా ఆమె ఈ వ్యాధితో బాధపడుతుందని,. కండరాల్లో కూడా పట్టు లేదు అని, కూర్చోలేక నిలబడలేక చాలా ఇబ్బంది పడుతుందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక సీమా హిందీలో 80కి పైగా సినిమాల్లో నటించిందట. అలాగే పలు మరాఠీ చిత్రాల్లో కూడా నటించింది. ఆమె భర్త రమేష్ డియో కూడా నటుడే అనే సంగతి తెలిసిందే. అతను గత ఏడాది మరణించడం జరిగింది.