యెమెన్ గుండా గల్ఫ్ రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఇథియోపియన్ వలసదారులపై సౌదీ సరిహద్దు గార్డులు పేలుడు ఆయుధాలు ప్రయోగించారని, గత సంవత్సరం నుంచి వందల మందిని చంపారని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. యెమెన్ బోర్డర్ వద్ద సామూహిక హత్యలు జరిగినట్లు తాజాగా ఓ రిపోర్టు రిలీజైంది. మానవ హక్కుల సంస్థ దీనిపై నివేదికను విడుదల చేసింది. యెమెన్ దేశం మీదుగా సౌదీ ఆరేబియాకు వెళ్తున్న ఇథోపియాకు చెందిన వందలాది శరణార్థుల్ని సౌదీ దళాలు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. అనేక సంఖ్యలో శరణార్థులు కాళ్లు పోగొట్టుకున్నారు. కానీ తమపై వస్తున్న ఆరోపణల్ని మాత్రం సౌదీ అరేబియా ఖండించింది. హ్యూమన్ రైట్స్ వాచ్(హెచ్ఆర్‌డబ్ల్యూ) తన రిపోర్టులో అనేక అంశాల్ని పొందుపరిచింది. యెమెన్ మీదుగా ప్రతి ఏడాది ఆఫ్రికా నుంచి సుమారు రెండు లక్షల మంది శరణార్థులు సౌదీ వెళ్తుంటారని యూఎన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.
శరణార్థులపై సౌదీ సైన్యం పేలుడు ఆయుధాలతో దాడి చేస్తుందని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. సౌదీ సైన్యంపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. అయితే క్రమబద్ధమైన హత్యల ఆరోపణలను సౌదీ ప్రభుత్వం తోసిపుచ్చింది. నివేదికలో వలసదారులు, శరణార్థుల వీడియోలు, ఫోటోలు సాక్ష్యంగా ఇవ్వబడ్డాయి. ఈ వీడియోవో సౌదీ సైన్యం యొక్క భయానక రూపం చూపబడింది. వలసదారులు భయంకరమైన నైట్ టైమ్ క్రాసింగ్ గురించి మాట్లాడుతున్నారు. మహిళలు, చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదని తెలిసింది. సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించిందని, పేలుడు ఆయుధాలతో దాడి చేశారని కొందరు చెప్పారు.
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం రెండు లక్షల మందికి పైగా ప్రజలు అక్రమంగా సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి వారు యెమెన్ మీదుగా సముద్రం ద్వారా సౌదీలోకి ప్రవేశిస్తారు. స్మగ్లర్లు కూడా వారితో దురుసుగా ప్రవర్తించి కొట్టారు. ఇలా సముద్రం దాటడం చాలా ప్రమాదకరం. ఇటీవల, జిబౌటీలో ఓడ బోల్తా పడి 24 మంది ప్రవాసులు మరణించారు. యెమెన్ గుండా వచ్చే ప్రజలు స్మశాన వాటిక గుండా వెళతారు. సైన్యం కాల్చి చంపిన తర్వాత వారి మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయి. చాలా సార్లు సైన్యం ఒక సమూహంలోని కొంతమందిని కాల్చివేస్తుందని, వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి కొంతమందిని విడిచిపెట్టిందని నివేదిక తెలిపింది.