చిన్నప్పుడు స్కూలుకు వెళ్తూ జేబులో బఠాణీలో, శనగలో వేసుకుని అలా తింటూ వెళ్లేవారు. పల్లెటూళ్లలో ఇప్పటికీ జరుగుతూ ఉండొచ్చు. ఇంట్లోవారు ఇస్తారు.. లేదంట దారిలో కొనుక్కుని వెళ్తారు. వీటిలో శనగలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు తెలీకపోవచ్చు.. కానీ పెద్దవారికి పిల్లల ఆరోగ్యంపై శ్రద్ద వహించి పిల్లలకు అలవాటు చేస్తారు. శనగల్లో పోషకాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. మంచి ఎనర్జీ సొంతమవుతుంది. పిల్లలకే కాదు.. పెద్దలకూ ఆరోగ్యమే. విటమిన్లు ఎక్కువగా ఉండే శనగలు ఎప్పడు తిన్నా.. ఎన్ని తిన్నా మంచిదే.
శనగల్లో ఉండే పాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు హైబీపీని తగ్గిస్తాయి. రక్తహీనతను తగ్గిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. వారానికి రెండుసార్లు శనగలు తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువేనని తేలింది. క్యాన్సర్ ను కూడా అడ్డుకునే శక్తి శనగలకు ఉందని అంటున్నారు. ప్రమాదకరమైన కొలన్ కాన్సర్ ను అడ్డుకునే శక్తి శనగల్లో ఉంది. శనగల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. వారిని ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. శనగలను కూరగా కూడా వండుకుని తింటారు. స్నాక్స్ లా కూడా శనగల్ని తీసుకోవచ్చు.
శనగల్ని నాన పెట్టి తింటారు.. ఉల్లిపాయ ముక్కలు కలిపి తింటారు.. ఉప్పు కారంతో వేపుకుని స్నాక్స్‌లా తింటారు. ఇన్నిరకాలుగా శనగల్ని తినొచ్చు. కాబట్టే.. శనగలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని అంటున్నారు. ఎముకల్ని కూడా ధృడంగా ఉండేలా చేస్తాయి. దేవాలయాల్లో కూడా ప్రసాదం కింద శనగల్నే పెడతారు. శనగల్లో ఇమ్యూనిటీ పెంచే గుణం ఉంది. రకరకాల వ్యాధులు రాకుండా ఉండే పోషకాలు వాటిలో ఉన్నాయి. అందుకే శనగలు కేవలం పెద్దవారే కాదు.. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాటి రుచి కూడా అంత బాగుంటుంది. కాబట్టి శనగల్ని ఓ పట్టు పట్టొచ్చు.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించగలరు.