Monday, December 23, 2024
Home ఆంధ్రప్రదేశ్ AP Politics: మూడో రోజుకు చేరిన ‘ఇసుక సత్యాగ్రహం’

AP Politics: మూడో రోజుకు చేరిన ‘ఇసుక సత్యాగ్రహం’

by Mahadev
0 comment 66 views
AP Politics

ఆంధ్ర ప్రదేశ్ లో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు చేపట్టిన ‘ఇసుక సత్యాగ్రహం’ మూడో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిరసన తెలుపుతున్న మరికొందరు నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు.ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని(డీఎంజీ) ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా వైకాపా ఇసుక దోపిడీ గురించి టీడీపీ సేకరించిన ఆధారాలను డీఎంజీ డైరెక్టర్‌కు సమర్పించి, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన దేవినేని ఉమ, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ను హౌస్‌ అరెస్ట్‌ చేయడంతో గొల్లపూడిలోని ఇంటి వద్దే దేవినేని నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఆనాడు బ్రిటిష్‌ పాలనలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేస్తే ఈరోజు జగన్‌మోహన్ రెడ్డి రాక్షస పాలనలో టీడీపీ ఇసుక సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలసీ తీసుకొస్తామని జగన్‌ చెబితే ప్రజలంతా నమ్మారన్నారు. వైకాపా నాయకులు గనులశాఖను అడ్డం పెట్టుకుని ఇసుక దోపిడీ చేసి ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పం కట్టారని ఉమా ఆరోపించారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News