స్టార్ హీరోయిన్ సమంత విడాకుల వ్యవహారం తర్వాత వరుసగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడిపోయాక కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేసి, వరుసగా క్రేజీ మూవీస్ లైనప్ చేసుకుంటుండగా.. అనారోగ్యం బారిన పడింది. ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి సోకడం, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం తెలిసిందే. కొద్ది రోజులు హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ప్రొఫెషన్‌కి బ్రేక్ ఇచ్చిన సామ్, ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలకు ఇంట్లోనే డబ్బింగ్ చెప్పి సినిమా అంటే తనకెంత ప్యాషనో ప్రూవ్ చేసింది. ఇప్పుడు మయోసైటిస్ చికిత్స కోసం ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాతో పాటు, సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. వీటి షూటింగ్ పూర్తైన వెంటనే సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ మూడు రోజుల క్రితం సమంత.. ‘కారవాన్ లైఫ్.. మరో మూడు రోజులు మాత్రమే’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ రాసింది.
తాజాగా ఈ రోజు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అంటూ మరో పోస్ట్ చేసింది. ‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజుతో సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది’ అని పేర్కొంటూ కళ్ల జోడు పెట్టుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు సెట్ లో అందరికీ వీడ్కోలు చెబుతూ కనిపించింది. ఈ లెక్కన సమంత ఏడాది బ్రేక్ మొదలవనుంది. రాజ్-డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ లో వరుణ్‌ధవన్, సమంత నటింటారు. కాగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకుంటుంది. షూటింగ్ దశలో ఉన్నవి కాకుండా కొత్తగా కమిట్ అయిన ఫిలింస్ క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి తన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాతలను పిలిపించి వారి డబ్బు తిరిగిచ్చేస్తుంది. సంవత్సరానికి 5, 6 సినిమాల్లో కనిపించే సమంత.. కొన్నాళ్ల పాటు వెండితెర మీద కనిపించదనే సరికి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.