మాజీ సీఎం(EX CM), టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడి(CHANDRABABU NAIDU)ని అరెస్ట్(ARREST) చేసింది సీఐడీ(CID).. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీసు ఇచ్చారు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(SKILL DEVELOPMENT SCAM)లో నంద్యాల(NANDYALA)లో చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.. మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(GANTA SRINIVAS RAO), ఆయన కొడుకును కూడా అరెస్ట్ చేశారు.. చంద్రబాబుతో కలిసి APSSDCని ఏర్పాటు చేసిన ఆరోపణలపై గంటాను అరెస్ట్ చేశారు.. ఇక, చంద్రబాబు అరెస్ట్‌తో ఎలాంటి ఆందోళనలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా బంద్(BANDH) వాతావరణం నెలకొంది.. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్(HOUSE ARREST) చేస్తున్నారు పోలీసులు.
అల్లూరి జిల్లా పాడేరు(PADERU)లో పాత బస్టాండ్ వద్ద పోలీసులు మోహరించారు.. మైదాన ప్రాంతాలకు వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాడేరులో ఉండటంతో పోలీసుల ముందస్తు తనిఖీలు చేస్తున్నారు. ఇక, అనంతపురం(ANANTAPURAM)లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి(EX MLA PARTHASARADHI) ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలపై నిఘా పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(RAJHAMUNDRY)లోని ప్రధాన కూడళ్లలో పోలీసులు(POLICE) మోహరించారు.. టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి(GORANTLA BUCCHAYYA CHOWDARY), ఆదిరెడ్డి భవానీల ఇంటి వద్ద పోలీసు పికెటింగ్ లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల ఇళ్ల వద్దకు మోహరించారు పోలీసులు.. గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు(MUPPIDI VENKATESWARA RAO)ను హౌస్ అరెస్ట్ చేశారు.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా పీలేరు, మదనపల్లెలో బస్సులు నిలిపివేశారు.
అనంతపురంలో బస్సులు డిపోలు, బస్టాండ్‌లకే పరిమితం అయ్యాయి.. శ్రీ సత్యసాయి జిల్లా(SRI SATYASAI DISTRICT) తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని హౌస్ అరెస్టు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరిని హౌస్ అరెస్ట్ చేశారు.. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడిని కూడా ఇంట్లో నుంచి బయకు రానివ్వడంలేదు.. నల్లజర్లలో మాజీ జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి ఇంటివద్దకు చేరుకున్న పోలీసులు.. నియోజకవర్గ ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజును హౌస్ అరెస్ట్ చేశారు.. మరోవైపు.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు.. పలువురు మండల స్థాయి నాయకులను అదుపులో తీసుకుంటున్నారు. నెల్లూరులోని అల్లిపురంలో ఉన్న సోమిరెడ్డి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు.. హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు.. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తిరుపతిలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల ఇళ్ళ వద్ద భారీగా మోహరించారు పోలీసులు.. టీడీపీ నాయకులు బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు.. ఒంగోలులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీని, దర్శిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు ఉమ్మడి జిల్లాలోని టీడీపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జ్ బండారు సత్యానందరావు, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంలను హౌస్ అరెస్ట్ చేశారు.. అంబేద్కర్ కోనసీమ అమలాపురం ఆర్టీసీ డిపో నుండి బయటకు రావడం లేదు బస్సులు.. అమలాపురంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు అధికారులు.. ఏలూరు పాత బస్ స్టాండ్ వద్ద మోహరించిన పోలీసులు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు టిడిపి నేతలు సిద్ధం అవుతుండగా.. వారిని అడ్డుంకున్నారు పోలీసులు.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆర్టీసీ డిపోకే బస్సులు పరిమితమయ్యాయి.. ముందస్తు అల్లర్లు నేపథ్యంలో బస్సుల ఆపామని ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు.. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తో పాటు నాయకులని హౌస్ అరెస్ట్ చేశారు.. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా పోలీసుల హై అలర్ట్ ప్రకటించారు.. టిడిపి నేతల కదలకలపై నిఘా పెట్టారు.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతల ఇంటి వద్ద పహారా కాస్తున్నారు.. ఎవరినీ బయటకు రాకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు.. అయితే, పోలీసులు తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో డిపోకే పరిమితం అయ్యాయి ఆర్టీసీ బస్సులు.. హిందూపురం తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ అదుపులోకి తీసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ను హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు.. విశాఖ నగరంలో సిటీ బస్సు సర్వీసులను నిలిపివేశారు ఆర్టీసీ అధికారులు.. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల ఇళ్ళ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. టీడీపీ నాయకులు బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు.. ఒంగోలులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. దర్శిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్యను హౌస్ అరెస్ట్ చేశారు.. మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని హౌస్ అరెస్టు చేశారు..
మరోవైపు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బస చేసిన క్యాంపు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన్ని బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన లోకేష్.. రోడ్డుపై బైఠాయించారు.. ఇక, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబును అరెస్ట్ చేశారు.. వెస్ట్ జోన్ ఏసీపీ కార్యాలయంకు తరలించారు.. చిత్తూరు మాజీ ఎమ్మెల్సీ దొరబాబుని బలవంతంగా అరెస్టు చేసి వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించారు. నగరంలో పలు చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశారు.. కాకినాడ తిమ్మాపురంలో యనమల, అచ్చెంపేట లో రాజప్ప, ఇర్రిపాకలో జ్యోతుల నెహ్రు లను హౌస్ అరెస్ట్ చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కే పరిమితం అయ్యాయి బస్సులు.. కేవలం తిరుమలకు మాత్రమే బస్సులను అనుమతి ఇస్తున్నారు అధికారులు..
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తూ.గో. జిల్లాలో ఎటువంటి అల్లర్లు జరగకుండా నిడదవోలు ప్రధాన కూడలిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును హౌస్ అరెస్ట్ చేశారు ఉండ్రాజవరం పోలీసులు.. ఏలూరు దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అయితే, చింతమనేని అందుబాటులో లేరని తెలుస్తోంది.. కళ్యాణదుర్గం మసీదు సర్కిల్లో నిరసన తెలపడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అరెస్ట్ చేశారు.. కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హౌస్ అరెస్ట్ చేశారు.. వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత హౌస్ అరెస్ట్ కాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకేష్ నిరసన చేపట్టారు.. చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం అందడంతో విజయవాడ బయలుదేరేందుకు సిద్ధమైన లోకేష్‌ను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు.. ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తన తండ్రిని చూసేందుకు వెళ్ళే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు..