Monday, December 23, 2024
Home తెలంగాణ Good news to Telangana Farmers: రుణమాఫీ కోసం రూ.వెయ్యి కోట్లు విడుదల

Good news to Telangana Farmers: రుణమాఫీ కోసం రూ.వెయ్యి కోట్లు విడుదల

by Mahadev
0 comment 55 views
Three more new revenue divisions in Telangana

రైతులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. బ్యాంకుల నుంచి పలు సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ (Loan waiver)వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే బుధవారం వరకు 21.35 లక్షల మంది రైతుల రూ.11,812 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ఆయా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. తద్వారా మెజార్టీ రైతులకు రుణమాఫీ(Loan waiver)ని పూర్తి చేసింది. తాజాగా ప్రభుత్వం బుధవారం రుణమాఫీ కోసం రూ.వెయ్యి కోట్లను విడుదల చేసింది.

దీంతో రుణమాఫీ ప్రక్రియ మరింత వేగం కానుంది. రెండో విడత రుణమాఫీ(Loan waiver)ని ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న ఒకే రోజు రూ.5809 కోట్లను రైతుల ఖాతాల్లో(farmers’ accounts) జమ చేసిన ప్రభుత్వం 9 లక్షల మంది రైతులను రుణవిముక్తులను చేసింది. ఇప్పటి వరకు 1.20 లక్షల రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి రూ.99,999 రుణానిన్న మాఫీ చేయగా.. రాబోయే రోజుల్లో రూ.లక్ష రుణం తీసుకున్న రైతుల రుణం సైతం మాఫీ చేయనున్నది.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News