తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎంల దీక్షపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. గర్భిణీ స్త్రీలను ఆరోగ్య రక్షణ విషయంలో ఏఎన్ఎంల కీలకపాత్ర వహిస్తుందన్నారు. గత 14 రోజుల నుండి సెకండ్ 2ఏఎన్‌ఎంలు చేస్తున్న దీక్షకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆరోగ్య రక్షణ కొరకు పాటుపడుతున్న 2ఏఎన్‌ఎం ప్రభుత్వం గుర్తించాలన్నారు. ప్రసూతి సమయంలో ఆడ శిశువుకు 13,000 మగ శిశువుకు 12,000 ఇస్తున్న డబ్బులు ఏమయ్యాయన్నారు. ప్రసూతి సమయంలో ఇచ్చే డబ్బులను కేసీఆర్ జేబులో వేసుకొని కేసీఆర్ మూడు వేల రూపాయలు విలువ చేసే కేసీఆర్ కిట్టును ఇస్తున్నారని ఆయన అన్నారు.
గ్రామాలలో గర్భిణీ స్త్రీలను ఆరోగ్య రక్షణ విషయంలో ఏఎన్ఎంల కీలకపాత్ర వహిస్తుందన్నారు. గర్భిణీ స్త్రీల ప్రసూతి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి ప్రమాదం జరిగినా గ్రామ ప్రజలు ఏఎన్ఎంలను బాధ్యులను చేస్తున్నారన్నారు. అయినా ఏఎన్‌ఎం ప్రజలతో తిట్లు తినుకుంటూ మీ వల్లే మాకు ప్రమాదం జరిగిందంటూ దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని ఆయన అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల కొరకు సేవలందించిన ఏఎన్ఎంలను బేషరతుగా రెగ్యూలరేషన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వీరికి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగాలు వచ్చాయన్నారు. రాబోయే ప్రభుత్వంలో మొదటిగా వీరిని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి వారిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు.