వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 51,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 46 చోట్ల ‘రోజ్‌గార్ మేళా’ నిర్వహించనున్నట్లు పీఎంవో తెలిపింది. సెప్టెంబర్ 26న రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో వర్చువల్ మీడియం (వీడియో కాన్ఫరెన్సింగ్) ద్వారా కొత్తగా నియమితులైన 51000 మంది ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ లెటర్లను కేటాయిస్తారు.
కొత్త ఉద్యోగులు తపాలా శాఖ, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌తో సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగులు IGOT కర్మయోగి పోర్టల్ ద్వారా శిక్షణ పొందగలరు. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా ఈ ఉపాధి మేళా ఒక ముందడుగు అని పీఎంవో పేర్కొంది.
ఇది మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, యువతకు వారి సాధికారత, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్ధవంతమైన అవకాశాలను అందిస్తుందని భావిస్తున్నారు.కొత్తగా నియమితులైనవారు కర్మయోగి స్టార్ట్, iGOT కర్మయోగి పోర్టల్‌లోని ఆన్‌లైన్ మాడ్యూల్ ద్వారా శిక్షణ పొందే అవకాశాన్ని కూడా పొందునున్నారు. ఇక్కడ ‘ఎనీవేర్ ఎనీ డివైస్’ లెర్నింగ్ ఫార్మాట్‌లో 680 పైగా ఈ-లెర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.