గత టీడీపీ(TDP) ప్రభుత్వ(GOVERNMENT) హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కాం(SKILL DEVELOPMENT SCAM)లో మాజీ సీఎం(EX CM) చంద్రబాబు(CHANDRABABU)ను నిన్న అరెస్టు(ARREST) చేసిన సీఐడీ(CID).. ఇవాళ ఏసీబీ(ACB) కోర్టు(COURT)లో హాజరుపర్చి రిమాండ్(REMAND) కు పంపింది. దీంతో 36 గంటల(36 HOURS) పాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ సంబరాలు(YCP CELBRATIONS) చేసుకుంటోంది. ముఖ్యంగా ఏపీ మంత్రి(AP MINISTER) ఆర్కే రోజా(RK ROJA) తన సొంత నియోజకవర్గం నగరి(NAGIRI)లో సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వరుసగా విమర్శలు గుప్పించిన మంత్రి ఆర్కే రోజా.. ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పు కోసం ముందు నుంచే ఎదురుచూశారు. తీర్పు కచ్చితంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తుందని, రిమాండ్ విధిస్తారని ఊహించిన ఆమె స్వీట్లు(SWEETS), బాణాసంచా(CRACKERS) రెడీ చేశారు. ఇలా తీర్పు ప్రకటించగానే వెంటనే తన ఇంటికి వచ్చిన కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచుతూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు.
చంద్రబాబు అంటేనే మండిపడే వైసీపీ రాజకీయ నేతల్లో ఒకరైన రోజా.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయనపై పలు సెటైర్లు వేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వానికీ, వైసీపీ ప్రభుత్వానికీ తేడా గుర్తుచేస్తూ ఆమె వేసే సెటైర్లు సీఎం జగన్ ను కూడా పలుమార్లు ఆకట్టుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబుపై రోజా చేస్తున్న మాటల దాడి మరింత ఎక్కువైంది. దీంతో సహజంగానే ఇవాళ చంద్రబాబు తొలిసారి జైలుకు వెళ్తుండటంతో రోజా సంబరాలు మిన్నంటాయి. ఉదయం కూడా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన తప్పులకు శిక్ష పడుతోందంటూ వ్యాఖ్యానించారు. ఏసీబీ కోర్టు తీర్పు వచ్చాక ఇదే విషయం మరోసారి చెప్పారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్వేగానికి కూడా లోనయ్యారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రోజా అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు.