ఆసియా కప్(ASIA CUP) 2023లో భాగంగా.. శ్రీలంక(SRILANKA)తో జరుగుతున్న మ్యాచ్(MATCH) లో టీమిండియా(TEAM INDIA) కెప్టెన్(CAPTAIN) రోహిత్ శర్మ(ROHITH SHARMA) అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్(ONE DAY INTERNATIONAL MATCH)లలో 10 వేల పరుగుల మార్కును దాటాడు. రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల(10 THOUSAND) పరుగులు చేసిన ఘనత సాధించాడు. శ్రీలంకపై సిక్సర్ కొట్టి.. 22వ పరుగులు చేసిన వెంటనే రోహిత్ శర్మ ఈ మైలురాయిని సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన మూడో వ్యక్తిగా(THIRD PERSON) రోహిత్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(VIRAT KOHLI) అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి 205 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగులను అధిగమించాడు. ఈ జాబితాలో భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్(SACHIN TENDLUKAR) మూడో స్థానంలో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. 10వేల మార్కును అందుకున్న ఆరో భారతీయ క్రికెటర్ గా, ఓవరాల్ గా 15వ బ్యాటర్ గా హిట్ మ్యాన్ రికార్డులకెక్కాడు.
ఇప్పటి వరకు రోహిత్ శర్మ 248 వన్డే మ్యాచ్‌లు ఆడగా.. 10025 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ పేరిట 30 సెంచరీలు ఉన్నాయి. ఇది కాకుండా రోహిత్ శర్మ యాభై పరుగుల మార్కును 50 సార్లు దాటాడు. వన్డే ఫార్మాట్‌లో మూడుసార్లు డబుల్ సెంచరీ మార్కును దాటిన ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ 49.14 సగటుతో 90.30 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.