ఏపీలో బస్సు ప్రమాదాలు లెక్కకు మించి జరుగుతున్నాయి.. గత రెండు నెలలుగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. బస్సులు ఢీ కొట్టుకోవడం, బోల్తా పడటం, ఫైర్ యాక్సిడెంట్ లాంటి ఎన్నో ఘటనలు లెక్క లేనన్ని వెలుగు చూడటంతో జనాలు బస్సుల్లో ప్రయాణం చెయ్యాలంటేనే భయంతో వణికి పోతున్నారు.. రాత్రి పూట ప్రయాణాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరగడంతో జనాలు దూర ప్రయాణాలు బస్సుల్లో చెయ్యాలంటే భయంతో వణికి పోతున్నారు.. ఇప్పుడు తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడికే మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు..
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది.
అర్ద రాత్రి దాటడంతో డ్రైవర్ నిద్రను కంట్రోల్ చేసుకోలేక నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. మరణించిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్(65),అబ్దుల్ హాని(60),షేక్ రమీజ్ (48),ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం(65),షేక్ షబీనా(35),షేక్ హీనా(6)గా గుర్తించారు.. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.