తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని.. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం నల్గొండలో సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌లో రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని వెల్లడించింది. పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. రాష్ట్రంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని బయటకి వెళ్లాలని వాతావరణ నిపుణులు సూచించారు. వర్షాకాలంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున శరీర సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి రోజు నీళ్లు అధిక మోతాదులో తీసుకోవాలని.. ఒక్కోసారి దాహంగా అనిపించక పోయినా.. నీళ్లు తాగితే మంచిదని నిపుణులు సూచనలు ఇచ్చారు. మరోవైపు టెంపరేటర్ పెరిగిన పుణ్యమా కరెంట్‌కు డిమాండ్ పెరిగింది. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడంతో.. విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం నల్గొండలో సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఆదివారం హైదరాబాద్ రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని వెల్లడించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని బయటకి వెళ్లాలని వాతావరణ నిపుణులు సూచించారు. వర్షాకాలంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున్న శరీర సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.