Monday, December 23, 2024
Home తెలంగాణ Revanthreddy on TSPSC Board: రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్​పీఎస్సీ బోర్డు: రేవంత్​రెడ్డి

Revanthreddy on TSPSC Board: రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్​పీఎస్సీ బోర్డు: రేవంత్​రెడ్డి

by Mahadev
0 comment 45 views
Revanthreddy on TSPSC Board

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాల్లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్‌పార్టీ(Congress Party) ఉద్యమిస్తూనే ఉంటుం దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి (Revanth Reddy)స్పష్టం చేశారు. టీఎస్​పీఎస్సీని.. ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుందని ఆరోపించారు. సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో జరిగిన టీఎస్​పీఎస్సీ(TSPSC) ప్రక్షాళనపై.. నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి బోర్డు సభ్యులుగా నియమించారని, గుమస్తా స్థాయిలేని వారు గ్రూప్-1 పరీక్ష ఎలా నిర్వహిస్తారని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీకేజీ జరిగినప్పుడే టీఎస్​పీఎస్సీ బోర్డును రద్దు చేసి అర్హులను నియమించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆరోపించారు. నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే.. శాశ్వత నియామకాలు లేవన్న ఆయన ఈ నిర్లక్ష్యానికి కారణం సీఎం కేసీఆర్ కాదా? అని నిలదీశారు.

బోర్డు వైఫల్యాలపై, అవకతవకలపై ఐటీ మంత్రి అని చెప్పుకుంటున్న మంత్రి తారక రామారావు ఏం సమాధానం చెబుతారని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. తండ్రికి కాళేశ్వరం(Kaleswaram).. కుమారుడికి టీఎస్​పీఎస్సీ.. కవితకు సింగరేణి ఏటీఎంలుగా మారాయని ధ్వజమెత్తారు. టీఎస్​పీఎస్సీ అవకతవకల మూలాలు సీఎంవో అధికారులేనని ఆరోపించిన రేవంత్​రెడ్డి.. గ్రూప్ 1 లీకేజీ కేసు(Group 1 leakage case)లో రాజశేఖర్​రెడ్డి, లింగారెడ్డిలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.పేపర్​ లీకేజి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు.. బోర్డును రద్దు చేయకుండా ప్రభుత్వం మొండిగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించిందని విమర్శించారు. సరైన విధానంలో పరీక్షలు నిర్వహించకపోవడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని ఆయన వ్యాఖ్యానించారు.

తక్షణమే టీఎస్​పీఎస్సీ(TSPSC) బోర్డును రద్దు చేయాల్సిన బాధ్యత సీఎం పై లేదా? అని రేవంత్ నిలదీశారు. టీఎస్​పీఎస్సీ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు సమీక్ష చేయడంలేదని ప్రశ్నించారు.బీఆర్​ఎస్​ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయిందన్న రేవంత్‌ రెడ్డి.. ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప, కనీస మానవత్వం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడుతుందన్న రేవంత్​రెడ్డి త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్…నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు.టీఎస్​పీఎస్సీ రద్దుకు బదులు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కోదండరాం చెప్పినట్లు రహదారుల దిగ్బందానికి కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని రేవంత్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, బీఎస్పీ నేత ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News