ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్ష మంది మరణాలకు కారమణమవుతున్నది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య పద్ధతులు రాగా.. క్యాన్సర్ చికిత్స సులభతరమే. అయినప్పటికీ ప్రమాదకరమే. అన్ని వయసులు, ఆడమగ తేడా లేకుండా అందరూ క్యాన్సర్ బారినపడుతున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలితో పాటు అనేక రకాల పర్యావరణ సమస్యల కారణంగా.. క్యాన్సర్ ప్రమాదం వేగంగా పెరుగుతోందని పలు నివేదిక పేర్కొంటున్నాయి. 40-50 సంవత్సరాల మధ్య వయస్కుల వారిలో క్యాన్సర్ వేగంగా పెరుగుతుందోని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలో క్యాన్సర్ రిస్క్ స్టడీస్‌పై విడుదలైంది. ఇందులో 50 ఏళ్లలోపు ఎక్కువగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారంటూ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 2010-2019 మధ్య క్యాన్సర్ నిర్ధారణ రేటు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తొమ్మిదేళ్లలో లక్ష మందిలో 100 నుంచి 103కి పెరిగింది. యువతలో ప్రాణాంతక వ్యాధి ప్రమాదం వేగంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. జామా నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. యువతలో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతున్నది. కొన్ని రకాల క్యాన్సర్ కేసుల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉన్నది. జీవనశైలి, ఆహార అలవాట్లతో పాటు అనేక రకాల పర్యావరణ పరిస్థితులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
యువతలో క్యాన్సర్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ కేసుల పెరుగుదలకు గల కారణాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదానికి కారణమేంటో మనం అర్థం చేసుకోకపోతే దాన్ని మార్చేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. క్యాన్సర్ ఎల్లప్పుడూ పెద్ద ఆందోళనకరమైన విషయమని, ఈ అధ్యయనం నివేదిక దాని ప్రమాదాలను మరింత పెంచిందన్నారు. యువతలో క్యాన్సర్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో స్పష్టంగా తెలియదని పేర్కొంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఊబకాయం, మద్యం, ధూమపానం, నిద్రలేమి, జీవనశైలి, పర్యావరణ కాలుష్యం క్యాన్సర్‌కు ప్రధాన కారకాలుగా పేర్కొంటున్నారు. క్యాన్సర్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్న చరిత్ర ఉంటే.. నివారణ కోసం ముందస్తుగా వైద్యుడిని కలవాలని సూచిస్తున్నారు.