యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఏడాది ఆదిపురుష్ తో నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ, మరి ఇంకెన్నో ఆశలు నడుమ ఆదిపురుష్ రిలీజ్ అయ్యింది. ఇక ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ సినిమాల మీదే అన్నీ ఆశలు పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా సలార్, దాని తర్వాత కల్కి2898AD. ఇక సలార్ గురించి పక్కన పెడితే కల్కిపైనే ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అందుకు కారణాలు చాలా ఉన్నాయి.. మొట్టమొదటిసారి ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయడం ఒకటి అయితే కమల్ హాసన్ మొదటి సారి విలన్ గా నటించడం రెండోది. ఇక ఈ రెండు కాకుండా మరో సెన్సేషనల్ విషయం ఈ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. అదేంటంటే ఈ సినిమాలోకి దర్శక ధీరుడు రాజమౌళి అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి కల్కి సినిమాలో జాయిన్ అయ్యాడట. కల్కి సెట్ లో జక్కన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాడని, షూటింగ్ కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటుంది.
రాజమౌళి సినీ ఇండస్ట్రీకి మకుటం లేని మహారాజు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఒక్క పరాజయాన్ని కూడా చవిచూడని దర్శకుడిగా, ఆస్కార్ ను ఇండియాకి తీసుకొచ్చిన డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇక జక్కన్న చేయి వేస్తే సినిమాకు తిరుగులేదని అభిమానుల అభిప్రాయం.
దీంతో కల్కిపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే లేదు కానీ త్వరలోనే మేకర్స్ రాజమౌళి ఆన్ ద బోర్డ్ అని చెప్పనున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కల్కి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డులు సృష్టించిందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.