కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల బాట పట్టనున్నారు. సెప్టెంబర్ లో విదేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు యూరప్ లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పర్యటనలో భాగంగా అక్కడ.. భారతీయ ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. 2023 ఆగస్టు 7న లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత మొదటి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.
మరోవైపు ఇదే సంవత్సరంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మే చివరి వారంలో అమెరికా టూర్ లో భాగంగా.. రాహుల్ గాంధీ శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ నగరాలకు వెళ్లారు. అక్కడ పారిశ్రామికవేత్తలు, అమెరికన్ ఎంపీలతో పాటు కొందరు భారతీయులను కలిశారాయన. అంతేకాకుండా ఈ పర్యటనలో బీజేపీ ప్రభుత్వంపై, మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతకుముందు లండన్ లో పర్యటించన రాహుల్.. అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీకి 2023లో ఇది మూడో విదేశీ పర్యటన. మరోవైపు మణిపూర్ అంశం, తన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం లాంటి అంశాలపై లోక్ సభలో రణరంగంగా మారింది. ఈ క్రమంలో రాహుల్ విదేశీ పర్యటనలో ఏం మాట్లాడుతారనేది ఆసక్తిగా మారింది.