తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్(CONGRESS) అగ్రనేత రాహుల్ గాంధీ(RAHUL GANDHI) ప్రకటించారు. యూపీఏ(UPA) హయాంలో నిర్వహించిన కుల గణన(CASTE SENSUS) వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని(CENTRAL GOVERNMENT) ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్(BILASPUR) జిల్లాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఆవాస్ న్యాయ సమ్మేళన్’లో పాల్గొన్న రాహుల్.. బీజేపీ(BJP) ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తమ పార్టీ రీమోట్ కంట్రోల్(REMOTE CONTROL)ను నొక్కితే సంక్షేమ ఫలాలు నిరుపేదలకు చేరతాయన్న రాహుల్… అదే బీజేపీ రీమోట్ కంట్రోల్ నొక్కితే అదానీకి విమానాశ్రయాలు(AIRPORTS), పోర్టులు(PORTS), కాంట్రాక్ట్(CONTRACTS)లు వస్తాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని కేబినెట్ క్యార్యదర్శులు, కార్యదర్శులే నడుపుతారని.. ఎంపీ(MP)లు, ఎమ్మెల్యే(MLA)లు కాదని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 90 మంది కార్యదర్శుల్లో.. ముగ్గురు మాత్రమే OBCలు ఉన్నారని పునరుద్ఘాటించారు. కేంద్ర బడ్జెట్‌లో ఐదు శాతాన్ని మాత్రమే వీరు నియంత్రిస్తున్నారన్న రాహుల్.. దేశంలో ఐదు శాతమే ఓబీసీలు ఉన్నారా అని ప్రశ్నించారు.
బిలాస్‌పుర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాహుల్ గాంధీ రైలులో ప్రయాణించారు. బిలాస్‌పుర్ నుంచి రాయ్‌పుర్ వరకు రైలులో ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే రైలులోని ప్రయాణికులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా, రాహుల్ ఇటీవల రైల్వే కూలీలతో ముచ్చటించారు. దిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్లో పనిచేస్తున్న కూలీలతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైల్వే కూలీల యూనిఫాం ధరించి లగేజీని సైతం రాహుల్ మోశారు