Monday, December 23, 2024
Home అంతర్జాతీయం G-20summit: ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్ కాల్.. ఎందుకో తెలుసా..?

G-20summit: ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్ కాల్.. ఎందుకో తెలుసా..?

by స్వేచ్ఛ
0 comment 70 views
puthin calls to modi

భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు ఫోన్ కాల్ చేసారు. అయితే భారత్‌లో జరుగనున్న జీ20 సమ్మిట్‌కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డుమ్మా కొట్టనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మన ప్రధాని మోదీకి చెప్పినట్లు సమాచారం. ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్ చేసి చెప్పినట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న శిఖరాగ్ర సమావేశాలకు రాలేకపోతున్నానని, రష్యా తరఫున తమ విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ హాజరవుతారని పుతిన్ చెప్పారు. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన బ్రిక్స్ సదస్సు, ద్వైపాక్షిక సహకారం, ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై మోదీ, పుతిన్‌ చర్చించుకున్నారు.

కాగా, ఈ ఏడాది జీ-20 బృందానికి భారత్‌ అధ్యక్షత వహిస్తుంది. సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది. ఈ మేరకు ఢిల్లీలో పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది భారత్​. ఈ సమావేశానికి పుతిన్‌ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఇంతకుముందే రష్యా స్పష్టత ఇచ్చింది. పుతిన్‌ ప్రత్యక్షంగా హాజరుకాబోరని తెలిపింది. ఆయన వర్చువల్‌గా పాల్గొంటారా? లేదా? అన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ రకంగానూ ఈ సదస్సులో పాల్గొనబోనని.. తన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ హాజరవుతారని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలు దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం వ్యక్తిగతంగా హాజరుకావడం లేదని ఆ దేశం స్పష్టం చేసింది. వర్చువల్‌గా సదస్సులో పాల్గొనవచ్చని తెలిపింది. మరోవైపు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్‌ అరెస్ట్‌ కోసం వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో అరెస్ట్‌ భయం వల్ల ఆయన విదేశాల్లో ప్రయాణించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ వ్యక్తిగతంగా హాజరుకాలేదు. అయితే వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. జీ20 సమ్మిట్‌లో కూడా పుతిన్‌ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తారని తెలుస్తున్నది. ఆయన తరఫున సెర్గీ లవ్రోవ్‌ పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు పుతిన్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఆయన విదేశాలకు వెళితే అరెస్టయ్యే ముప్పు ఉంది. అందుకే ఆయన జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News