‘పుష్ప 2′(PUSHPA 2) రిలీజ్ డేట్(RELEASE DATE)పై మొత్తానికి ఓ క్లారిటీ(CLARITY) వచ్చేసింది. 2024 ఆగస్టు 15వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నట్లు మేకర్స్(CINI MAKERS) అనౌన్స్(ANNOUNCE) చేసేశారు. అయితే ఈ డేట్‌ను సినిమా(CINEMA) విడుదల చేయడం బాగానే ఉంది. పబ్లిక్ హాలీడే(PUBLIC HOLIDAY) కావడం వల్ల లాంగ్ వీకెండ్(LONG WEEKEND) కలిసొస్తుంది. కానీ ఈ డేట్.. వెయ్యి కోట్ల మార్కెట్(1000 CRORES MARKET)ను అందుకుంటుందా అనేది కాస్త అనుమానంగానే ఉంది. ఈ చిత్రం ఆగస్ట్ 15న(AUGUST 15 2024) గురువారం రిలీజ్ చేస్తున్నారు. అంటే మొదటి వీకెండ్లో నాలుగు రోజులతో మంచి వసూళ్లు వస్తాయి. ఇక రెండో వీకెండ్ వచ్చేసరికి రాఖీ పండుగ, ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో వినాయక చవితి ఇలా సినిమాకు మంచి హాలిడేస్ దొరికాయి. కానీ ఇదే సమయంలో కోలీవుడ్‌లో దిగ్గజ దర్శకుడు శంకర్(DIRECTOR SHANKAR) తెరకెక్కిస్తున్న ఇండియన్ 2(INDIAN 2) సినిమా కూడా రిలీజయ్యే(RELEASE) అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా(PAN INDIA) స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది శంకర్. విక్రమ్‌తో బ్లాక బస్టర్ హిట్ అందుకున్న యూనివర్స్ స్టార్ కమల్ హాసన్(UNIVERSAL STAR KAMAL HASAN). దీంతో సౌత్ ఇండస్ట్రీలో (SOUTH INDUSTRY)పుష్ప 2కు గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సింగం 3(SINGHAM 3) కూడా అదే సమయంలో రిలీజ్ కానుందట. ఈ సినిమా సిరీస్‌కు మాస్ అండ్ యాక్షన్ ప్రియుల అండ ఉంటుంది. అందులో ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి. ఈ చిత్రానికి అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. అంటే పుష్పరాజ్ రెండు చోట్ల గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది రూ.1000 కోట్లు అందుకోవాలన్న పుష్ప రాజ్‌కు కాస్త ఎఫెక్ట్ అనే చెప్పాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి. పుష్ప కల నెరవేరుతుందో లేదో!