ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థి (Intermediate student)అనుమానాస్పద మృతి ఘటన సంచలనంగా మారింది. మైనర్ బాలిక మృతి(Death of a minor girl) పలు అనుమానాలకు తావిస్తున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. యువతి మృతి చెంది వారం రోజులు గడుస్తున్నా ఈ కేసును పోలీసులు ఛేందించినట్లు తెలుస్తుంది. భవ్యశ్రీ మృతి(Death of Bhavyashree) కేసుపే విచారణ చేపట్టిన పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. తల్లితండ్రులు మందలించడంతోనే మనస్తాపం చెంది భవ్యశ్రీ ఆత్మహత్య(Bhavyashri committed suicide) చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భవ్యశ్రీ కేసులో పోలీసుల దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తరువాత భవ్యశ్రీ మృతిపై పోలీసులు చివరిగా ఓ క్లారటీకి రానున్నట్లు సమాచారం.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురానికి చెందిన మునికృష్ణ, పద్మల చివరి కుమార్తె భవ్యశ్రీ(16) పెనుమూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 16న గ్రామంలో వినాయక చవితికి ఏర్పాట్లు జరుగుతుండగా పూలు కోసేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన భవ్యశ్రీ(Bhavyashree) కనిపించకుండా పోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామస్తుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా భవ్యశ్రీ కనిపించలేదు. దీంతో ఈ నెల 17వ తేదీ సాయంత్రం పెనుమూరు పోలీసులకు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు(Missing case) నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ఈ నెల 19వ తేదీ సాయంత్రం భవ్యశ్రీ ఇంటి సమీపంలోని పాడుబడిన బావిలో మృతదేహం తేలుతూ కనిపించింది. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని బావిలోంచి వెలికితీసి మృతదేహం భవ్యశ్రీగా గుర్తించారు. మృతదేహం నుంచి నమూనాలు సేకరించి ఆర్‌ఎఫ్‌ఎఫ్‌ఎస్ ల్యాబ్‌కు తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బావిలో భవ్యశ్రీ తల గుండు కొట్టినట్టుగా కనిపించడం, భవ్యశ్రీ వేసుకున్న కాళ్లకు లెగ్ హీల్స్ లేకపోవడం, కనురెప్పలు తెగిపోవడం, నాలుక కరుచుకోవడంపై భవ్యశ్రీ తల్లిదండ్రులు, స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సాంకేతిక విశ్లేషణ ద్వారా కేసును ఛేదించే ప్రయత్నం చేస్తుండగా.. భవ్యశ్రీది ఆత్మహత్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది రోజుల తరువాత చివరకు పోలీసులు భవ్యశ్రీ ది ఆత్మహత్యగా అనుమానం వ్యక్తం చేడయం సంచలనంగా మారింది.