తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల దీప్తి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నాలుగు రోజులుగా హైదరాబాద్ సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో విసృత్త తనిఖీలు చేపట్టిన పోలీసులు.. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దీప్తి(Software Deepthi) సోదరి చందనతో పాటు మరో యువకుడి ఆచూకిని కనుగొన్నారు. ఈ ప్రకారంగా ఒంగోలు సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజులుగా నాలుగు పోలీస్ బృందాలతో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ హత్యకు సంబంధించి ఇప్పుడు చందన ఏం చెప్పనుంది. ఈ కేసులో అక్క దీప్తిని తనే హత్య(Murder) చేసిందా? లేక దీప్తిని చెల్లెలు చందన, ఆమె ప్రియుడు హత్య చేశారా? ప్రియుడి ప్రేమకోసం ఇదంతా చేసిందా? లేదా డబ్బులు, నగల కోసం చేసిందా? ఇలా పలు రకాలుగా ఈ ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. చెందన, ప్రియుడు ప్లాన్ ప్రకారమే దీప్తిSoftware Deepthi)ని మద్యం తాగింది హత్య చేసి నగదుతో పరారయ్యరా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పోలీసుల దర్యాప్తులో ఓ ఆడియోను బయటికి తీశారు. తన అక్క దీప్తిని తాను చంపలేదు అంటూ తమ్ముడు సాయికి చెల్లెలు చందన వాయిస్ మెసేజ్ పంపించింది. దీప్తి శరీరం పై గాయాలతో పాటు ఆమె ఎడమ చేయి విరిగడంతో హత్య కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
వాయిస్ మెసేజ్:
‘అరేయ్ సాయి నేను చందక్కనురా, నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ, అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్‌ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా. నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాం. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి, నా తప్పేం లేదు ప్లీజ్ నమ్మురా. రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన ఇట్లా అయితదనుకోలేదు. నేనెందుకు చంపుతా సాయి, నేనేందుకు మర్డర్ చేస్తా.’
కోరుట్ల దీప్తి మర్డర్ కేసు:
భీమునిదుబ్బ(Bhimunidubba) ప్రాంతంలో దంపతులు బంకా శ్రీనివాస్‌రెడ్డి, మాధవి నివాసం ఉంటున్నారు. వీరికి దీప్తి (24), చందన, సాయి అనే ముగ్గురు పిల్లలు. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. రెండో కూతురు చందన బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఖాళీగా ఉంది. కొడుకు సాయి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. బంధువులు రావడంతో శ్రీనివాస్‌రెడ్డి(Srinivas Reddy) దంపతులు ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తెలతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్ చేయగా పెద్దమ్మాయి దీప్తి ఫోన్ రిసీవ్ చేయలేదు. చిన్న కూతురు చందన ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌లో ఉంది. వెంటనే ఇంటి పక్కనే ఉన్న వారికి సమాచారం అందించారు. వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా దీప్తి అపస్మారక స్థితి(unconsciousness state)లో పడి ఉంది. వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు.
అనంతరం స్థానిక సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సోఫాలో దీప్తి మృతదేహం పడి ఉండగా వంటగదిలో రెండు మద్యం సీసాలు, శీతల పానీయం సీసా, ఫుడ్ ప్యాకెట్లు కనిపించాయి. చెల్లి చందన కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సోమవారం ఉదయం 5.12 గంటల నుంచి 5.16 గంటల వరకు ఓ యువకుడితో కలిసి నిజామాబాద్(Nizamabad) బస్టాండ్‌లో కూర్చుంది. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కినట్లు కెమెరాల్లో రికార్డయింది. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు దీప్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.