పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ పార్టీలను ప్రైవేట్ కంపెనీలుగా నడిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవ్వరూ నడుపుతున్నారో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ మరో చేతిలో ఉందన్నారు. కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
తెలంగాణ రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని తెలిపారు ప్రధాని మోడీ. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవులు కుటుంబ సభ్యులకే ఉన్నాయి. పెద్ద పోస్టుల్లో కుటుంబ సభ్యులుంటారు.. అవసరాల కోసం మాత్రం కొంత మందిని పెడతారు. బీజేపీ (BJP) మాత్రం సామన్యులకోసం ఆలోచిస్తుంది. రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతుందని.. మోడీ ఇచ్చే గ్యారెంటీపైన ఎంత నమ్మకం ఉందో ప్రజలకు తెలుసు అన్నారు. ప్రతీ హామీని మోడీ నెరవేరుస్తున్నారు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీపై ఆదరణ పెరుగుతుందన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రకటించామని.. కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress & BRS) పార్టీలకు ఈ రాత్రి నిద్ర కూడా పట్టదన్నారు.
పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి.. మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల కాలంలోనే ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ (BJP)అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అబద్దాలు వాగ్దానాలు కాదు.. క్షేత్ర స్థాయిలో పనులు తెలంగాణకు కావాలన్నారు. రాణి రుద్రమదేవి లాంటి వీరామణులు పుట్టిన గడ్డ తెలంగాణ అని గుర్తుచేశారు. మహిళల జీవితాన్ని మెరుగు పరిచేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు.
పేదలకు గ్యాస్, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు మోడీ. 2014 పూర్వం కాంగ్రెస్ హయాంలో కేవలం 3400 కోట్లు మాత్రమే ధాన్యాన్ని కొనుగోళ్లు చేస్తే.. బీజేపీ ప్రభుత్వం( BJP Governament) రైతుల సంక్షేమం రూ.27వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. పదేళ్లలో 2,500 కిమీ వరకు నేషనల్ హైవేలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ గ్రామం నుంచి పల్లె నుంచి పట్టణాలకు వచ్చేందుకు రోడ్లను నిర్మించామని తెలిపారు. ఢిల్లీలో (New Delhi) ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోకూడదన్నారు