తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో(TET Exam Centers) పరీక్ష సజావుగా పూర్తి అయింది. అయితే సంగారెడ్డి (Sanga reddy District)జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన రాధిక అనే గర్భిణి(Pregnant) మృతి చెందింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్(Isnapur)లో పరీక్ష రాసేందుకు వచ్చిన 8 నెలల గర్భిణి రాధిక.. ఎగ్జామ్ హాల్‌కు వెళ్లే తొందరలో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఎగ్జామ్ హాల్‌కు చేరుకున్న కాసేపటికే బీపీ ఎక్కువై ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే గమనించిన ఇన్విజిలేటర్.. ఇతర సిబ్బంది ఆమె కుటుంబానికి సమాచారం అందించారు.
రాధికతో పాటు వచ్చిన ఆమె భర్త అరుణ్(Arun) వెంటనే ఆమెను పటాన్చెరు(Patancheru) ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాధిక(Radhika) మరణంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎనిమిది నెలల గర్భిణి అయినా.. రాత్రింబవళ్లు ఈ పరీక్ష కోసం చాలా కష్టపడి చదివిందని.. తీరా పరీక్ష రాయడానికి వస్తే ఏకంగా ప్రాణాలే పోయాయంటూ ఆమె భర్త కన్నీరుమున్నీరుగా(tears) విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
‘రాధికకు బీపీ ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నప్పుడు తనకు బీపీ ఉందని అక్కడి వైద్యులు చెప్పారు. తను గత మూడు వారాల నుంచి బీపీ ట్యాబ్లెట్స్ వాడుతోంది. ఇవాళ సడెన్‌గా పరీక్షా కేంద్రంలో పడిపోయింది. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి తనకు పల్స్ పడిపోయింది. గుండెపోటు వచ్చి ఉంటుందని మేం భావిస్తున్నాం.’ – ప్రియదర్శిని, వైద్యురాలు