పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) భారత ప్రభుత్వం ప్రారంభించిన దీర్ఘకాలిక పెట్టుబడి స్కీమ్. భద్రమైన, నమ్మకమైన ఈ పొదుపు ఫండ్ గురించిన మరిన్ని వివరాలు..
ఎవరైనా తన సొంత పేరు మీద పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. మైనర్ విషయంలో పిల్లల తరపున తల్లిదండ్రులు, సంరక్షకుల అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. కనీస మొత్తం రూ.500. గరిష్ట మొత్తం సంవత్సరానికి రూ.1.5 లక్షలు. ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా 12 వాయిదాలలో పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్ ఖాతాకు గరిష్ట వ్యవధి 15 సంవత్సరాలు. అయితే ఈ వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు.
పీపీఎఫ్ వడ్డీ రేటును ప్రతి త్రైమాసికంలో కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రస్తుత వడ్డీ రేటు ఏడాదికి 7.1%గా ఉంది.
ఈ పథకం కింద వచ్చే రిటర్న్‌లు పన్ను రహితం. ఈ ఫండ్‌లోని మొత్తం నుంచి అవసరమైనప్పుడు.. రుణంతో బాటు విత్ డ్రా సౌకర్యమూ అందుబాటులో ఉంది. పీపీఎఫ్ ఖాతాకి నామినీ సౌకర్యమూ ఉంది. ఒకరు లేదా ఎక్కువ మందిని నామినీగా పెట్టుకోవచ్చు. ఏ నామినీకి ఎంత చెల్లించాలో ముందే నిర్ణయించవచ్చు. పీపీఎఫ్ ఖాతాను బ్యాంక్‌లోని ఏదైనా ఇతర బ్రాంచ్‌కి, ఏదైనా ఇతర పోస్టాఫీసుకు ఎటువంటి ఛార్జీలు లేకుండా బదిలీ చేయవచ్చు.