ఆసుపత్రిలో చిన్నపిల్లాడిని ఎత్తుకుపోతుంటే.. పిల్లల్ని అమ్మే ముఠానో(children selling gang), లేదా తాను పిల్లలు లేరని పెంచుకుందామని ఎత్తుకుపోయిందో అనుకున్న పోలీసులకు కంట నీరు కార్చే సన్నివేశం ఎదురైంది. కడుపు చించుకు పుట్టిన పిల్లలు(Childrens) అరుదైన వ్యాధితో మృతి చెందుతుండటంతో కన్నపేగు జీర్ణించుకోలేకపోయింది. తల్లి ప్రేమకు నోచుకోలేకపోతున్న మహిళ.. పిల్లలు లేని బాధను తట్టుకోలేకపోయింది. ఎలాగైనా అమ్మా అని పిలుపించుకోవాలని చావుబతుకుల మధ్య ఉన్న తన పదిరోజుల పసికందును ఆస్పత్రిలోనే వదిలేసి.. ఓ పిల్లాడిని ఎత్తుకుపోయింది. కన్నతల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిందితురాలు పట్టుకున్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో అపహరణకు గురైన ఆర్నెళ్ల చిన్నారి కేసులో ఖాకీల మనసు కదిలించేలా నిందితురాలి ధీన గాధ అందరినీ కలిచివేస్తుంది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Bansuada) కొత్తబడి తండాకు చెందిన కాట్రోత్ శ్రీను, మమత(Mamtala)లకు 8ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన రెండేళ్లకు బాబు జన్మించాడు. కంటికి రెప్పలా పెంచుకున్న బాబు ఆర్నెళ్ల వయసులోనే మృతి చెందాడు. ఆ తర్వాత మమత మరో బాబుకు జన్మనిచ్చింది. పుట్టిన కొన్ని రోజులకే తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఈ జన్యులోపాలతో పుడతారని వైద్యులు తెలిపారు. రెండో బాబు కూడా 2నెలల వయసులో మృతి చెందాడు. నీ కడుపున పుట్టే పిల్లలు ఈ అరుదైన వ్యాధితో చనిపోతారని వైద్యులు మమత దంపతులకు తెలిపారు.
15 రోజుల క్రితం మమత కొత్తబడి తండా()లో మరో బాబుకి జన్మనిచ్చింది. ఆ బాబు కూడా అనారోగ్యం పాలవడంతో ఈ నెల 14వ తేదీన భర్తతో కలిసి మమత నీలోఫర్ ఆస్పత్రికి వచ్చింది. అక్కడ పరీక్షించిన వైద్యులు బాబు బతకడం కష్టమని చెప్పారు. దీంతో కట్టలు తెంచుకున్న కన్నీరుతో మమత తన పసికందును తీసుకొని ఓపీ వార్డు నుంచి హాల్ లోకి వచ్చింది. అక్కడే తన బాబుతో కూర్చొని రోదించింది. ఎలాగైనా బాబు కావాలని భర్తతో కన్నీరుమున్నీరైంది. పిల్లలు పుట్టినా ఎలాగూ చనిపోతారు కదా.. ఎవరైనా బాబును పెంచుకుందామని మమత ఆలోచించింది. ఇదే విషయాన్ని భర్తతో పంచుకుంది. ఈ క్రమంలోనే నీలోఫర్ ఆస్పత్రి నుంచి చిన్నారిని ఎత్తుకెళ్లాలనే దుర్బుద్ధి పుట్టంది.
అనుకున్నదే తడవుగా తన పదిరోజుల పసికందును అక్కడే వదిలిపెట్టి సమీపంలో ఉన్న హాల్లోకి వెళ్లింది. చిన్నారులను ఆడిస్తున్న తల్లులను గమనించింది. మమతను చూసి ఓ చిన్నారి నవ్వింది. ఆ చిన్నారిని ఎత్తుకొని ఆడిస్తున్న ఫరీదా బేగంతో మమత మాట కలిపింది. ఫరీదా భోజనం కోసం తన పిల్లాడిని అక్కడే పడుకోబెట్టి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన మమత.. ఆర్నెళ్ల చిన్నారిని అపహరించి నీలోఫర్ ఆస్పత్రి నుంచి ఉడాయించింది. బాబును మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన తల్లి ఫరీదా నాంపల్లి పీఎస్లో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు.